ప్రింటింగ్‌ ప్రెస్‌లో వింత శబ్ధాలు.. అది చూసి అందరూ షాక్

Updated on: Jan 07, 2026 | 5:47 PM

ఇటీవలి భారీ వర్షాలతో కలుపు మొక్కలు పెరిగి, పాములకు ఆవాసాలయ్యాయి. ఆహారం దొరక్క అడవుల నుండి పాములు, కొండచిలువలు జనవాసాల్లోకి చొరబడుతున్నాయి. కర్నూలు ప్రింటింగ్ ప్రెస్‌లో 14 అడుగుల కొండచిలువ ప్రజలను భయాందోళనకు గురిచేసింది. స్నేక్ క్యాచర్ చాకచక్యంగా పట్టుకొని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన ఆవశ్యకతను ఈ సంఘటన తెలియజేస్తుంది.

ఇటీవల భారీగా కురిసిన వర్షాలకు ఎక్కడపడితే అక్కడ కలుపు మొక్కలు బాగా పెరిగిపోయాయి. దాంతో పాములు, ఇతర సరీసృపాలకు ఆవాసాలుగా మారుతున్నాయి. అడవులు, పుట్టల్లో ఉండాల్సిన పాములు అక్కడ ఆహారం దొరక్క జనావాసాల్లోకి చొరబడుతున్నాయి. రాత్రి, పగలు ఎక్కడపడితే అక్కడ పాములు, కొండచిలువలు దర్శనమిస్తూ జనాలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలోని ఓ ప్రింటింగ్‌ ప్రెస్‌లో భారీ కొండచిలువ కలకలం రేపింది. కర్నూలు నగరంలోని సీతారాం నగర్ లో ప్రభుత్వ ప్రింటింగ్‌ ప్రెస్‌ ఒకటి ఉంది. ప్రెస్‌ ఆవరణలో కలుపు మొక్కలు, చెత్తా చెదారం పేరుకుపోవడంతో పాములు చేరుతున్నాయి. తాజాగా అక్కడ ఓ భారీ కొండచిలువ హల్ చేయటంతో దానిని చూసి జనం భయంతో వణికిపోయి.. తలోదిక్కూ పారిపోయారు. 14 అడుగుల పొడవు 30 కేజీల పైన బరువు ఉన్న ఈ కొండచిలువ విషయం కాలనీ అందరికీ తెలియడంతో జనం అక్కడ గుమిగూడారు. కొందరు స్థానిక స్నేక్‌ క్యాచర్‌కు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న స్నేక్ క్యాచర్‌ ఎంతో చాకచక్యంగా కొండచిలువను ఒక సంచిలో బంధించి సేఫ్‌గా అటవీప్రాంతంలో వదిలిపెట్టాడు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రింటింగ్ ప్రెస్ ప్రెస్ ఆవరణలో చెత్త, కలుపు మొక్కలు పెరిగిపోవడంతో పాములు, తేళ్లు, విషపురుగులు చేరుతున్నాయని, వెంటనే ప్రెస్‌ ఆవరణను శుభ్రం చేయించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

దుర్గమ్మ దర్శనానికి వెళుతున్నారా ?? ఇంద్రకీలాద్రిపై మారిన రూల్స్ తెలుసుకోండి

సర్పంచ్‌ ఉదారత.. పుట్టిన ప్రతి ఆడబిడ్డకు రూ.5000 డిపాజిట్‌

TTD: ఇకపై శ్రీవారి భక్తుల చెంతకే జల ప్రసాదం..

కంచే చేను మేయడమంటే ఇదే.. ఏకంగా దేవుడికే పంగనామాలు పెట్టారుగా

విజయ్‌ సినిమాకు సెన్సార్ చిక్కులు కోర్టుకెక్కిన హీరో