Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో మళ్లీ భారీ వర్షాలు.!
గురువారం పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని సరిహద్దు వాయవ్య బంగాళాఖాతం, ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ -దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడింది. దానికి అనుబంధం ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 ఎత్తు లో కి.మీ ఎగువన విస్తరించి ఉంది. ఇది వచ్చే 2 రోజుల్లో ఉత్తరం దిశ వైపు నెమ్మదిగా కదులుతూ వెళ్తుందని వాతావరణశాఖ అంచనా వేసింది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని సరిహద్దు వాయవ్య బంగాళాఖాతం, ఉత్తర ఆంధ్ర ప్రదేశ్ -దక్షిణ ఒడిశా తీర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడింది. దానికి అనుబంధం ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 ఎత్తు లో కి.మీ ఎగువన విస్తరించి ఉంది. ఇది వచ్చే 2 రోజుల్లో ఉత్తరం దిశ వైపు నెమ్మదిగా కదులుతూ వెళ్తుందని వాతావరణశాఖ అంచనా వేసింది. రుతుపవన ద్రోణి ప్రస్తుతం సూరత్‌గఢ్, రోహ్‌తక్, ఒరై, మాండ్లా మీదుగా ఉత్తర ఆంధ్రప్రదేశ్-దక్షిణ ఒడిశా తీరాల్లో వున్న అల్పపీడన కేంద్రం నుండి ప్రయాణిస్తూ ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించి వుంది. ఈ క్రమంలో రాబోవు మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలో గురు, శుక్ర, శనివారాల్లో తేలికపాటినుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తుందని, కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు పడతాయని వాతావరణశాఖ తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉపరితల గాలులు వీస్తాయని వెల్లడించింది. ఇటు దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్, రాయలసీమలోనూ ఈ మూడు రోజులూ తేలికపాటినుంచి ఓ మోస్తరు భారీవర్షం కురుస్తుందని, పలుచోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపింది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.