Budameru Floods: బుడమేరుకు మళ్లీ పెరిగిన వరద.. గంట గంటకు పెరుగుతున్న వరద.

|

Sep 09, 2024 | 8:40 AM

విజయవాడను అతలాకుతలం చేసిన బుడమేరు మళ్లీ క్రమంగా పెరుగుతోంనది. దీంతో గత నాలుగు రోజులుగా వరద నీటిలోని చిక్కుకున్న ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బుడమేరులోకి వరద ఉధృతి ఎక్కువవుతోంది. వైఎస్‌ఆర్‌ కాలనీలోకి బుడమేరు వరద చేరింది. జక్కంపూడి, వైఎస్‌ఆర్ కాలనీ, పైపుల రోడ్డు జలమయం అయ్యాయి. గంట గంటకు బుడమేరు పెరగడంతో వరద బాధితులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

విజయవాడను అతలాకుతలం చేసిన బుడమేరు మళ్లీ క్రమంగా పెరుగుతోంనది. దీంతో గత నాలుగు రోజులుగా వరద నీటిలోని చిక్కుకున్న ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా బుడమేరులోకి వరద ఉధృతి ఎక్కువవుతోంది. వైఎస్‌ఆర్‌ కాలనీలోకి బుడమేరు వరద చేరింది. జక్కంపూడి, వైఎస్‌ఆర్ కాలనీ, పైపుల రోడ్డు జలమయం అయ్యాయి. గంట గంటకు బుడమేరు పెరగడంతో వరద బాధితులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. బుడమేరుకు 8000 క్యూసెక్కుల వరద నీరు పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దీనిపై మైకులతో అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మొత్తం 25 గ్రామాలకు ఈ ప్రమాదం పొంచి ఉందని వారు హెచ్చరికలు జారీ చేశారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని లేదా ప్రభుత్వ పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. బుడమేరుకు మూడుచోట్ల గండిపడగా ఇప్పటికే మొదటి గండిపూడ్చి మితగా రెండు గండ్లను పూడ్చడానికి పనులు ముమ్మరం చేస్తున్నారు. వరద ప్రవాహం పెరుగుతుండడంతో గండ్లు పూడ్చడానికి పనుల్లో ఆటంకం ఎదురవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.