పిల్లలతో కలిసి వర్షాన్ని.. ఎంజాయ్‌ చేస్తున్న విదేశీ చిరుత

|

Jul 09, 2024 | 5:44 PM

కూనో నేషనల్‌ పార్కులో విదేశీ చిరుతలు సందడి చేస్తున్నాయి. దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన గామినీ అనే చీతాతోపాటు దాని ఐదు కూనలు మధ్యప్రదేశ్ అడవుల్లో చిరుజల్లులను ఆస్వాదిస్తూ సందడి చేశాయి. మధ్యప్రదేశ్ లోని షియోపూర్ పరిధిలో ఉన్న కునో నేషనల్ పార్క్ లో తల్లీబిడ్డలు శుక్రవారం సరదాగా ఆడుకోవడం ఓ వీడియో కెమెరాలో రికార్డయింది. ఈ అందమైన వీడియోని కేంద్ర మంత్రి భూపేందర్‌ యాదవ్‌ తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేస్తూ.. ప్రకృతి తీసుకొచ్చే కాలానుగుణ మార్పుల మధ్య..

కూనో నేషనల్‌ పార్కులో విదేశీ చిరుతలు సందడి చేస్తున్నాయి. దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన గామినీ అనే చీతాతోపాటు దాని ఐదు కూనలు మధ్యప్రదేశ్ అడవుల్లో చిరుజల్లులను ఆస్వాదిస్తూ సందడి చేశాయి. మధ్యప్రదేశ్ లోని షియోపూర్ పరిధిలో ఉన్న కునో నేషనల్ పార్క్ లో తల్లీబిడ్డలు శుక్రవారం సరదాగా ఆడుకోవడం ఓ వీడియో కెమెరాలో రికార్డయింది. ఈ అందమైన వీడియోని కేంద్ర మంత్రి భూపేందర్‌ యాదవ్‌ తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేస్తూ.. ప్రకృతి తీసుకొచ్చే కాలానుగుణ మార్పుల మధ్య.. అవన్నీ కలిసి ఎప్పటికీ చెరిగిపోని కుటుంబ బాంధవ్యాలను అల్లుకుంటాయి’ అంటూ క్యాప్షన్ ను జోడించారు. దక్షిణాఫ్రికాలోని కలహరి టైగర్‌ రిజర్వ్‌ నుంచి గామిని అనే చిరుతను గత మార్చిలో ఇక్కడికి రప్పించారు. దాన్ని మధ్యప్రదేశ్‌లోని కూనో నేషనల్‌ పార్క్‌లో ఉంచారు. అది ఇక్కడ ఐదు పిల్లలకు జన్మనిచ్చింది. దీంతో భారత్ లో పుట్టిన చీతా కూనల సంఖ్య 13కు చేరింది. అలాగే కునో నేషనల్ పార్క్ లో ఉన్న చీతాలు, వాటి కూనల సంఖ్య 26కు పెరిగింది. చీతాలు ఒత్తిడిరహిత వాతావరణంలో తిరిగేలా తోడ్పడుతున్న అటవీశాఖ సిబ్బంది, ఫీల్డ్ స్టాఫ్, వెటర్నరీ వైద్యులను కేంద్ర మంత్రి అభినందించారు. కాగా, కేంద్ర మంత్రి పోస్ట్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. మరో ఆఫ్రికా దేశమైన నమీబియా నుంచి కునో నేషనల్ పార్క్ కు తీసుకొచ్చిన జ్వాలా అనే చీతా నాలుగు కూనలకు జన్మనిచ్చింది. 2022లో కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ చీతా పేరుతో నమీబియా నుంచి 8 చీతాలను తీసుకొచ్చింది. అలాగే దక్షిణాఫ్రికా నుంచి 2023 ఫిబ్రవరిలో 12 చీతాలను కూడా తీసుకొచ్చి ఇవే అడవుల్లో ప్రవేశపెట్టింది. అయితే నమీబియా నుంచి తెచ్చిన చీతాల్లో ఒకటి ఈ ఏడాది జనవరిలో కన్నుమూసింది. మొత్తంగా దేశంలో 2023 నుంచి ఇప్పటివరకు ఏడు పెద్ద చీతాలు, మూడు కూనలు మృత్యువాతపడ్డాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బుల్లి వారసులతో కారులో ముకేశ్‌-నీతా అంబానీ షికారు

పోలీసులు తీర్చలేని పంచాయితీని.. చిటికెలో పరిష్కరించిన గేదె

ఒరేయ్ ఎవర్రా నువ్వు.. పాము కాటేస్తే ఇలా చేస్తావా

మహిళా కళాశాల ప్రిన్సిపాల్‌ గదిలో మద్యం బాటిళ్లు

ఇకపై కరెంట్‌ బిల్లు కట్టడం మరింత ఈజీ!