Viral video: ఒంటికాలిపై స్కూల్‌కు..కంటతడి పెట్టిస్తున్న దివ్యాంగ విద్యార్థిని వీడియో..
ఓ దివ్యాంగ విద్యార్థిని చదువుపై ఉన్న మక్కువతో స్కూలుకు వెళ్తున్న విధానం హృదయాలను కదిలిస్తోంది. ఈ బాలిక చక్కగా స్కూల్ యూనిఫాం వేసుకొని ఒంటికాలిపై స్కూల్‌కు వెళ్లే వీడియో
ఓ దివ్యాంగ విద్యార్థిని చదువుపై ఉన్న మక్కువతో స్కూలుకు వెళ్తున్న విధానం హృదయాలను కదిలిస్తోంది. ఈ బాలిక చక్కగా స్కూల్ యూనిఫాం వేసుకొని ఒంటికాలిపై స్కూల్‌కు వెళ్లే వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అయ్యింది. బీహార్ రాష్ట్రంలోని జాముయ్ జిల్లాకు చెందిన ఆ విద్యార్థిని ప్రతిరోజూ కిలోమీటర్ దూరంలో ఉన్న పాఠశాలకు అలా గెంతుకుంటూ వెళ్తోంది. ఈ వీడియో ప్రముఖ నటుడు, సమాజ సేవకుడు సోనూసూద్ కంటపడింది. ఆ చిన్నారి అవస్థ చూసి చలించిపోయిన సోనూసూద్ త్వరలోనే ఆమెకు సహాయం చేయనున్నట్లు ప్రకటించారు.స్థానిక మీడియా ప్రకారం ఓ రోడ్డుప్రమాదంలో ఆ విద్యార్థిని కాలు కోల్పోయింది. అయినా, చదువుకోవాలనే ఆమె తపనముందు వైకల్యం ఓడిపోయింది. ఒంటికాలిపై గెంతుతూ తన లక్ష్యాన్ని సాధించేందుకు స్కూల్ బాటపట్టింది. ఆ విద్యార్థినికి చదువుపై ఉన్న శ్రద్ధ సోనూసూద్‌ను కట్టిపడేసింది. ‘ఇక నువ్వు స్కూల్‌కు ఒక కాలిపై గెంతుకుంటూ వెళ్లవు. టికెట్స్ పంపిస్తున్నా వచ్చేయ్.. నువ్వు రెండు కాళ్లపై చెంగుచెంగున స్కూల్‌కు వెళ్లాల్సిన సమయం వచ్చేసింది.’ అని ఆయన ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ చూసి సోనూసూద్‌పై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Sorry: పుణ్యం కోసం రామకోటి రాస్తారు.. మరీ సారీ కోటి ఏంటో..? గోడలు, మెట్లు, చెట్టు, కొమ్మ అంతటా సారీ, సారీ..
Rashmika Mandanna: క్రష్మిక క్రష్ ఎవరో చెప్పేసింది.. స్కూల్ డేస్ నుంచి అతనంటే చాలా ఇష్టం..!
Man dies in hotel: హోటల్‌లో ప్రేయసితో శృంగారం చేస్తూ వ్యక్తి మృతి.. ఏం జరిగిందంటే..?
Google Search: ఈ 3 విషయాలు గూగుల్‌లో సెర్చ్ చేయకండి.. చేస్తే జైలుకెళ్లడం కన్ఫమ్..!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

