Sesame Oil: నువ్వుల నూనెతో ఆరోగ్యమే కాదు.. అందం కూడా.!

|

May 21, 2024 | 1:07 PM

వేసవి వచ్చిందంటే పచ్చళ్ల సీజన్‌ మొదలవుతుంది. పచ్చళ్లు అనగానే అందరికీ గుర్తొచ్చేది నువ్వుల నూనె. అద్భుతమైన రుచితోపాటు, ఏడాది పాటు నిల్వ ఉండే పచ్చళ్ల కోసం నువ్వుల నూనెను ఎక్కువగా వాడతారు. అమ్మమ్మల కాలంలో ముఖ్యంగా ఎదిగే అమ్మాయిలకు, బాలింతలకు నువ్వులతో చేసిన వంటకాలను, పదార్థాలను ఇచ్చే వారు. దాదాపు ఆరు నెలల వరకు బాలింతలకు నువ్వుల నూనెతో..

వేసవి వచ్చిందంటే పచ్చళ్ల సీజన్‌ మొదలవుతుంది. పచ్చళ్లు అనగానే అందరికీ గుర్తొచ్చేది నువ్వుల నూనె. అద్భుతమైన రుచితోపాటు, ఏడాది పాటు నిల్వ ఉండే పచ్చళ్ల కోసం నువ్వుల నూనెను ఎక్కువగా వాడతారు. అమ్మమ్మల కాలంలో ముఖ్యంగా ఎదిగే అమ్మాయిలకు, బాలింతలకు నువ్వులతో చేసిన వంటకాలను, పదార్థాలను ఇచ్చే వారు. దాదాపు ఆరు నెలల వరకు బాలింతలకు నువ్వుల నూనెతో వండిన ఆహారాలను అందించే వారంటే దీని విశిష్టతను అర్థం చేసుకోవచ్చు. ఇక పండుగలు పబ్బాలు వచ్చాయంటే నువ్వుల నూనెతో నలుగులు, మసాజ్‌లు ఆ సందడే వేరుగా ఉండేది.

నువ్వులతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. గుండె జబ్బులు, మధుమేహం, ఆర్థరైటిస్ నుండి రక్షణ పొందవచ్చు. నువ్వుల నూనెను కేవలం ఆరోగ్యం కోసమే కాదు, సౌందర్యపోషణలోనూ ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. నువ్వుల నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు, ఓమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ బీ, ఈ కాల్షియం, జింక్, ఐరన్, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉన్నాయి. నువ్వుల గింజలలో పైబర్‌ కూడా ఎక్కువగా లభిస్తుంది. క్రమం తప్పకుండా నువ్వులు తినడం వల్ల అధిక కొలెస్ట్రాల్ , ట్రైగ్లిజరైడ్‌లను తగ్గించుకోవచ్చని కొన్ని అధ్యయనాలు ద్వారా తెలుస్తోంది. కండరాల నుండి హార్మోన్ల వరకు ప్రోటీన్ చాలా అవసరం. ఆ కొరతను నువ్వుల ద్వారా తీర్చుకోవచ్చు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us on