వరి పొట్టుతో గ్లాసులు, ప్లేట్స్‌ !! గుడ్‌ బై ప్లాస్టిక్‌ !! వీడియో

|

Jan 16, 2022 | 7:45 PM

యూజ్‌ అండ్‌ త్రో ప్లాస్టిక్‌ వస్తువుల వినియోగం ఒక్క ఇండియాలోనే కాదు... ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లోనూ విచ్చలవిడిగా ఉంది.

యూజ్‌ అండ్‌ త్రో ప్లాస్టిక్‌ వస్తువుల వినియోగం ఒక్క ఇండియాలోనే కాదు… ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లోనూ విచ్చలవిడిగా ఉంది. వీటివల్ల పర్యావరణానికి ముప్పు అని తెలిసినా వేరే ప్రత్యామ్నాయాలు లేకపోవడం వల్లనో, ఇతర కారణాలతోనే వాటినే వాడుతుంటాం. అయితే తాజాగా ఓ కొత్త రకం ఫుడ్‌ కంటైనర్లు ఈ ప్లాస్టిక్‌కి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. వరిపొట్టుతో తయారైన గ్లాసులు, ప్లేట్లకు సంబంధించిన ఓ వీడియోను ఐఏఎస్‌ అధికారి సుప్రియా సాహు తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. “ఈ ఫుడ్ కంటైనర్లు వరి పొట్టుతో తయారయ్యాయి. ఇవి లీక్ అవ్వవు, తక్కువ ధరకే లభిస్తాయి, భూమిలో తేలిగ్గా కరిగిపోతాయి, పర్యావరణానికి మేలు చేస్తాయి” ఇకనైనా తమిళనాడులోని హోటల్స్, రెస్టారెంట్లు, ఫుడ్ జాయింట్లలో ప్లాస్టిక్ వాడకం ఆపేసి… ఇలాంటి పర్యావరణ హితమైనవి వాడాలి” అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

మరిన్ని ఇక్కడ చూడండి:

వామ్మో .. పులి తన నోటితో కారును లాగడం ఎప్పుడైనా చూశారా !! వీడియో

జింకలకు స్వాతంత్య్రం !! చెంగు చెంగున ఎగురుతూ అడవిలోకి.. వీడియో

మంచుతో నిండిపోయిన జమ్ము కాశ్మీర్‌.. చూస్తుండగానే లోయలో పడిపోయిన కారు !! వీడియో

Digital TOP 9 NEWS : పానీపూరి నూడుల్స్‌ కోసం జనం క్యూ.. కొత్త అల్లుడి కోసం 365ఫుడ్‌ ఐటమ్స్‌ !! వీడియో

Digital News Round Up: మెగాస్టార్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌ | ఆ మర్యాదకు అల్లుడు బిత్తరపోయాడు..లైవ్ వీడియో