170 కేజీల బరువు.. జిమ్ చేస్తూ కుప్పకూలిపోయాడు
బరువు తగ్గడానికి జిమ్‌కు వెళ్తున్నారా?.. అయితే ఈ వార్త తప్పకుండా చూడాల్సిందే. ఓ వ్యక్తి ఇలాగే జిమ్‌కు వెళ్లి వర్కవుట్స్ చేస్తూ కుప్పకూలి ప్రాణం పొగొట్టుకున్నాడు. గత నాలుగు నెలలుగా కచ్చితమైన డైట్ పాటిస్తూ.. ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ వహిస్తూ.. స్టెరాయిడ్స్, ప్రోటీన్ పౌడర్లకూ దూరంగా ఉన్నాడట. హర్యానా ఫరీదాబాద్‌లోని నహర్ సింగ్ కాలనీకి చెందిన 37 ఏళ్ల పంకజ్ శర్మ జులై 1వ తేదీన స్నేహితుడు రోహిత్‌తో కలసి జిమ్‌కు వెళ్లాడు.
బ్లాక్ కాఫీ తాగిన తర్వాత.. షోల్డర్ పుల్-అప్స్ చేయడం ప్రారంభించారు. మూడో పుల్-అప్ సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. ఆ శబ్దానికి జిమ్‌లో వాళ్లంతా పరిగెత్తుకొచ్చారు. అప్పటికే కాస్త స్పృహతో ఉన్న అతనికి నీటిని అందించడంతో.. వాంతులు చేసుకున్నాడు. ఆ వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. దీంతో రెండుసార్లు సీపీఆర్ చేశారు. అయినా ఫలితం లేకపోయింది. సమీపంలోని ఆస్పత్రి నుంచి వైద్యులను రప్పించగా.. అప్పటికే అతని ఊపిరి ఆగిపోయింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక రావాల్సి ఉంది. గత నాలుగు నెలలుగా ఫరీదాబాద్ సెక్టార్ 9లో ఉన్న జిమ్‌కు క్రమం తప్పకుండా వెళ్తున్నాడు. నాలుగేళ్ల కిందట వివాహం జరిగింది. రెండున్నరేళ్ల పాప కూడా ఉంది. తండ్రి కన్‌స్ట్రక్షన్ కంపెనీలో చేదోడు వాదోడుగా ఉంటున్నాడతను. అయితే అతని బరువు 170 కేజీలకు చేరింది. దీంతో బరువు తగ్గించుకునేందుకు జిమ్‌ను ఆశ్రయించాడు. అధిక బరువు ఉన్నవారు లేదంటే ఆరోగ్య సమస్యలున్నవారు జిమ్ ప్రారంభించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Coolie: కూలీ సినిమాపై లోకి ప్రయోగం !! మరో కబాలి కాదు కదా ??
అభిషేక్ బచ్చన్ బ్యాడ్ లక్ !! కెరీర్‌ను నిలబెట్టే ఛాన్స్ మిస్..