అడవి జంతువుల వేట.. గ్రే హౌండ్స్ కానిస్టేబుల్‌ని బలి తీసుకుంది

|

Feb 12, 2024 | 8:28 PM

ఎంతోమంది అమాయకుల ప్రాణాలు తీస్తున్న అటవీ జంతువుల వేట ఇప్పుడు ఓ గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ప్రాణాలను బలి తీసుకుంది. అడవుల్లో అన్నల వేటకోసం వెళ్ళిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ విద్యుత్ షాక్‎కి గురై మృతి చెందారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సీఎం పర్యటన సందర్భంగా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్న అధికార యంత్రాంగానికి ఈ విషాద ఘటన ఎదురైంది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్ పల్లి అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది.

ఎంతోమంది అమాయకుల ప్రాణాలు తీస్తున్న అటవీ జంతువుల వేట ఇప్పుడు ఓ గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ప్రాణాలను బలి తీసుకుంది. అడవుల్లో అన్నల వేటకోసం వెళ్ళిన గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ విద్యుత్ షాక్‎కి గురై మృతి చెందారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సీఎం పర్యటన సందర్భంగా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్న అధికార యంత్రాంగానికి ఈ విషాద ఘటన ఎదురైంది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూర్ పల్లి అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. ఫిబ్రవరి 13న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల బృందం మేడిగడ్డ బ్యారేజ్ సందర్శన నేపథ్యంలో ఆ ప్రాంతానంతా పోలీసులు జల్లెడ పడుతున్నారు. గ్రేహౌండ్స్ దళాలు, స్పెషల్ పార్టీ పోలీసులు అడవులను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. మహదేవపూర్, కాటారం, కాళేశ్వరం అడవులను అణువణువు గాలిస్తున్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతం కావడంతో అడవుల్లో విస్తృతంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఊహించని విషాద సంఘటన చోటుచేసుకుంది. అటవీ జంతువులను హతమార్చడం కోసం స్మగ్లర్లు అమర్చిన విద్యుత్ తీగలు తగిలి ప్రవీణ్ అనే గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఆటో డ్రైవర్‎కు కనిపించిన అదృశ్య శక్తి.. తవ్వకాలు జరిపి చూస్తే.. ఊరంతా పండుగే

కొడుకునంటూ తిరిగొచ్చిన సన్యాసి.. అసలు సన్యాసే కాదట

బాల రాముడి దివ్యమైన కనులను చెక్కింది వీటితోనే.. అరుణ్ యోగిరాజ్ పోస్ట్ వైరల్

TOP9 ET: మహేష్‌ సినిమా అంటే చులకనా.. ఫ్యాన్స్‌ సీరియస్ | ఒక్కొక్కరికీ ఇచ్చిపడేసిన డైరెక్టర్

Follow us on