Viral Video: కొన్ని నెలలపాటు ద్రాక్షపండ్లను తాజాగా ఉంచాలా.. ఫ్రిజ్ అవసరమే లేని నాచురల్ పద్ధతి.. వైరల్ వీడియో..

|

Apr 20, 2022 | 7:15 PM

ఈ వైరల్ వీడియోలో ఫ్రిజ్ లేదా ఎలాంటి రసాయనాలు లేదా ప్రిజర్వేటివ్‌లను ఉపయోగించకుండా ద్రాక్షను కొన్ని నెలలుగా తాజాగా ఉంచారు. ఈ విషయం తెలిసి నెటిజన్లు షాకవుతున్నారు.

Viral Video: కొన్ని నెలలపాటు ద్రాక్షపండ్లను తాజాగా ఉంచాలా.. ఫ్రిజ్ అవసరమే లేని నాచురల్ పద్ధతి.. వైరల్ వీడియో..
Grapes Viral Video
Follow us on

ఇంటర్నెట్‌లో ఎన్నో ఆసక్తికరమైన వీడియోలు ప్రతిరోజూ మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఇందులో కొన్ని మనకు ఆశ్చర్యం కలిగిస్తే.. మరికొన్ని మాత్రం షాకిస్తాయి. వీటితో పాటే మనం నేర్చుకునే, ప్రేరణ పొందగలిగే వీడియోలు కూడా అప్పుడప్పుడూ కనిపిస్తూనే ఉంటాయి. ఇలాంటి వాటిలో కొన్ని పాతకాలం రోజుల్లో వాడే పద్ధతులు కూడా చేరిపోతుంటాయి. మన పూర్వీకులు ఎలాంటి ఎలక్ట్రికల్ పరికరాలు లేదా రసాయన పదార్థాలు వాడకుండానే ఆహారాన్ని ఎక్కువ కాలం భద్రపరుస్తుంటారు. అయితే, ఇవి కాలక్రమేణా మరుగున పడిపోయాయి. ఇలాంటి కోవకే చెందిన ఓ వీడియో ప్రస్తుం నెట్టింట్లో (Viral Video) తెగ సందడి చేస్తోంది. మట్టి పాత్రలో ద్రాక్ష(Grapes)ను తాజాగా ఉంచే పద్ధతిని ఇందులో చూపించారు. ఈ వీడియో నెటిజన్లకు ఎంతో నచ్చడంతో తెగ వైరల్ చేస్తున్నారు. అలసు ఇది ఎలా పని చేస్తుందని ఆశ్చర్యపోతున్నారు. అసలు దీనిని ఎలా తయారు చేయాలి, ఎన్ని రోజులకు వరకు తాజాగా ఉంచుతుందంటూ ప్రశ్నలు సంధిస్తున్నారు.

ద్రాక్షను తాజాగా ఉంచేందుకు చేసిన ఈ పద్ధతి నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. ఈ వీడియోను @archaeohistories Instagramలో పోస్ట్ చేశారు. ఇది 2.3 మిలియన్లకు పైగా వ్యూస్, 96.3k లైక్‌లు, 18.8k రీట్వీట్‌లను అందుకుంది. ఈ పద్ధతిని ఆఫ్ఘనిస్తాన్‌లో వాడినట్లు వీడియోలో చూపించారు. ఉత్తరాన గ్రామీణ ప్రాంతాల్లో శతాబ్దాల క్రితం ఇదే పద్ధతిని ఉపయోగించారు. ‘కంగినా’ అని పిలిచే ఈ ఆహార సంరక్షణ పద్ధతిలో ద్రాక్షను తాజాగా, గాలి చొరబడకుండా ఉంచేందుకు మట్టితోపాటు గడ్డిని ఉపయోగించి కంటైనర్‌ లాంటి పాత్రలను ఉపయోగించారు. ఈ కంటైనర్లలోనే ద్రాక్షను నిల్వ చేశారు. అవి అవసరమైనప్పుడు తెరుస్తారు. ఈ ప్రత్యేకమైన సాంకేతికతతో ఆఫ్ఘనిస్తాన్‌లో ద్రాక్షను ఆరు నెలల వరకు భద్రపరవచ్చని పేర్కొన్నారు. ఈ వీడియోపై పలువురు ట్విట్టర్‌లో స్పందించారు. ఆరు నెలల తర్వాత కూడా ద్రాక్ష చాలా తాజాగా కనిపించడంపై కొందరు ఆశ్చర్యపోయారు. ఈ ప్రక్రియలో రసాయనాలు లేదా ఫ్రిజ్ ఉపయోగించకపోవడంతో నెటిజన్లు షాకవుతున్నారు. అసలు ఇది ఎలా సాధ్యమంటూ తెగ ప్రశ్నలు కురిపిస్తున్నారు.

Also Read: Viral Video: కుక్కను ఓ రేంజ్‌లో కాకా పట్టిన పిల్లి.. దాని ట్యాలెంట్‌కు ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే..!

Shah Rukh Khan: జక్కన్నకు బాద్షా గాలం !! షారుక్ భారీ ప్లాన్ ఇదే !!