Surrogacy Leave: సరోగసీ ద్వారా తల్లైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగికి.. ప్రసూతి సెలవులు.!

|

Jun 27, 2024 | 8:08 PM

కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు కేంద్రం గుడ్‌ న్యూస్‌ అందించింది. సరోగసీ ద్వారా సంతానం పొందే కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులు ప్రసూతి సెలవులు పొందవచ్చు. ఈ మేరకు కేంద్రం 50 ఏళ్ల నాటి నిబంధనకు సవరణలు ప్రకటించింది. చైల్డ్ కేర్ లీవ్‌తో అద్దె గర్భం ద్వారా బిడ్డలను పొందే తల్లిదండ్రులకు హక్కు కల్పిస్తూ కేంద్రం సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్, 1972ని సవరించింది.

కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు కేంద్రం గుడ్‌ న్యూస్‌ అందించింది. సరోగసీ ద్వారా సంతానం పొందే కేంద్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులు ప్రసూతి సెలవులు పొందవచ్చు. ఈ మేరకు కేంద్రం 50 ఏళ్ల నాటి నిబంధనకు సవరణలు ప్రకటించింది. చైల్డ్ కేర్ లీవ్‌తో అద్దె గర్భం ద్వారా బిడ్డలను పొందే తల్లిదండ్రులకు హక్కు కల్పిస్తూ కేంద్రం సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్, 1972ని సవరించింది. అద్దెగర్భం ద్వారా పిల్లలు పుడితే మహిళా ప్రభుత్వ ఉద్యోగులు 180 రోజుల ప్రసూతి సెలవులు తీసుకోవచ్చు. అలాగే సరోగసీ ద్వారా జన్మించిన పిల్లల విషయంలో,ఇద్దరు కంటే తక్కువ జీవించి ఉన్న పిల్లలను కలిగి ఉన్నపురుష ప్రభుత్వ ఉద్యోగి కూడా బిడ్డ ప్రసవించిన తేదీ నుండి 6 నెలల వ్యవధిలో 15 రోజుల పితృత్వ సెలవు తీసుకోవచ్చు. కాగా సరోగసీ ద్వారా బిడ్డ పుడితే మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు ప్రసూతి సెలవులు మంజూరు చేయాలనే నిబంధనలు ఇప్పటి వరకు లేవు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.