Viral: ఊరంతటికీ ఆ గొట్టమే ఆధారం.. ప్రకృతి జలధారనే అమ్మలా అడవి ప్రజల దాహం తీరుస్తుంది.

|

Aug 26, 2023 | 9:33 PM

ఊరన్నాకా ఇళ్లు, వాకిళ్లు.. ప్రజలు తాగేందుకు మంచినీటి బావులు.. అవీ లేకపోతే చెరువులు ఉంటాయి. కానీ ఆ ఊరిలో అలాంటివేవీ కనిపించవు. ఊరంతా కొండలు నుంచి వచ్చే నీటిని తాగుతారు. ఎత్తయిన కొండలు నుంచి జాలువారే నీటిని పట్టుకునేందుకు ఒక గొట్టాన్ని ఏర్పాటు చేసుకున్నారు స్ధానికులు. దీంతో ఆ ఊరి పేరే గొట్టపుతోగుగా మారిపోయింది. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో గొట్టపుతోగు గ్రామం చుట్టూ దట్టమైన అడవి మధ్యలో 20 ఇళ్ళు మాత్రమే ఉండే పల్లె అది.

ఊరన్నాకా ఇళ్లు, వాకిళ్లు.. ప్రజలు తాగేందుకు మంచినీటి బావులు.. అవీ లేకపోతే చెరువులు ఉంటాయి. కానీ ఆ ఊరిలో అలాంటివేవీ కనిపించవు. ఊరంతా కొండలు నుంచి వచ్చే నీటిని తాగుతారు. ఎత్తయిన కొండలు నుంచి జాలువారే నీటిని పట్టుకునేందుకు ఒక గొట్టాన్ని ఏర్పాటు చేసుకున్నారు స్ధానికులు. దీంతో ఆ ఊరి పేరే గొట్టపుతోగుగా మారిపోయింది. ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో గొట్టపుతోగు గ్రామం చుట్టూ దట్టమైన అడవి మధ్యలో 20 ఇళ్ళు మాత్రమే ఉండే పల్లె అది. దారి, తెన్ను ఉండదు. ప్రధాన రహదారికి 15 కిలో మీటర్లు దూరంలో అటవీ ప్రాంతంలో ఉండే ఆ పల్లెకు అతి కష్టం మీద ద్విచక్ర వాహనం మాత్రమే నడవగలదు.

అటువంటి పల్లెల్లో తాగునీటికి ప్రకృతే ఆధారం. ఆ గ్రామానికి ఆనుకొని ఎత్తైన కొండ రాళ్లు లోపలి పొరల నుంచి జలదధార బయటకు వస్తుంది. గ్రామస్తులు ఆ ధారకు ఒక గొట్టాన్ని అమర్చి ఆ నీటిని పట్టుకొని తమ తాగునీరు, ఇతర అవసరాలకు తీర్చుకుంటున్నారు. ఆ గొట్టం ద్వారా వచ్చే జలధారతోనే ఆ గ్రామం బతుకుతుంది. కనుక, ఆ గ్రామానికి ‘గొట్టపు తోగు ‘ అన్న పేరును పెట్టుకున్నారు అక్కడి ఆదివాసులు. మరోవైపు బోరు వేసేందుకు రిగ్గు లారీ ఆ గ్రామానికి వెళ్ళలేదు. దీంతో అక్కడి ఆదివాసులకు నీటి సౌకర్యం ఏర్పాటు చేయడం అధికారులకు గగనమైంది. అయితే ప్రకృతితి వారిని కరుణించింది. నిత్యం ఓ నీటి పాయ కొండరాతి పొరల నుంచి జాలువారుతుంటుంది. మండే వేసవిలో కూడా ఏ మాత్రం తగ్గకుండా ఆ నీరు 24 గంటలు ఒకే విధంగా క్రిందికి వస్తుంటుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...