60 ఏళ్ల చరిత్రకు ముగింపు.. ఈ ట్యాక్సీలను ఇక చూడలేం

|

Oct 30, 2023 | 9:44 PM

ముంబై అంటేనే ముందుగా గుర్తొచ్చేవి ఎల్లో, బ్లాక్‌ ట్యాక్సీలు. 60 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ట్యాక్సీలు ఇక ముంబై వీధుల్లో కనిపించవు. కాళీ-పీలీ ట్యాక్సీలుగా పిలువబడుతున్న ఎల్లో, బ్లాక్ ట్యాక్సీలను ముంబై ట్రాన్స్ పోర్ట్ అథారిటీ బ్యాన్ చేసింది. ఇటీవల ముంబై స్పెషల్ లెజెండరీ రెడ్ బెస్ట్ డబుల్ డెక్కర్ బస్సును రద్దు చేసిన ముంబై ట్రాన్స్ పోర్ట్ అథారిటీ.. కాలపరిమితి తీరడంతో తాజాగా మరో ముంబై తీపీ జ్ఞాపకం.. కాలీ-పీలీ ట్యాక్సులకు ఉద్వాసన పలికింది.

ముంబై అంటేనే ముందుగా గుర్తొచ్చేవి ఎల్లో, బ్లాక్‌ ట్యాక్సీలు. 60 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ట్యాక్సీలు ఇక ముంబై వీధుల్లో కనిపించవు. కాళీ-పీలీ ట్యాక్సీలుగా పిలువబడుతున్న ఎల్లో, బ్లాక్ ట్యాక్సీలను ముంబై ట్రాన్స్ పోర్ట్ అథారిటీ బ్యాన్ చేసింది. ఇటీవల ముంబై స్పెషల్ లెజెండరీ రెడ్ బెస్ట్ డబుల్ డెక్కర్ బస్సును రద్దు చేసిన ముంబై ట్రాన్స్ పోర్ట్ అథారిటీ.. కాలపరిమితి తీరడంతో తాజాగా మరో ముంబై తీపీ జ్ఞాపకం.. కాలీ-పీలీ ట్యాక్సులకు ఉద్వాసన పలికింది. ఆరు దశాబ్దాలుగా ముంబై వాసుల జీవితాల్లో అంతర్భాగమైన ఈ ట్యాక్సీలు 1964లో ఫియట్ 1100 డిలైట్ పేరుతో పరిచయమయ్యాయి. ఆ రోజుల్లో నడిచే ఫ్లైమౌత్, ల్యాండ్ మాస్టర్, డాడ్జ్ వంటి పెద్ద ట్యాక్సీలతో పోలిస్తే ఫియట్ 1100 చాలా చిన్నది. తర్వాత 1970లో వీటిని ప్రీమియర్ ప్రెసిడెంట్ పేరుతో రీ బ్రాండ్ చేశారు. ఆ తర్వాత ప్రీమియర్ పద్మిని గా మార్చారు. కాళీ-పీలీలు కేవలం ప్రయాణమార్గంలోనే కాదు.. నగరం సాంస్కృతిక వారసత్వంలోనూ అంతర్భాగమయ్యాయి. ఈ ట్యాక్సీల పేరుతో ట్యాక్సీ నంబర్ 9211 వంటి సినిమాలు కూడా నిర్మించారు. అప్పట్లో అనేక పాత బాలీవుడ్ సినిమాల్లో ముంబైకి సింబల్‌గా ప్రారంభ షాట్‌లో చూపించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

వాళ్లను వదిలేయండి .. ఇజ్రాయెల్‌ అధ్యక్షుడికి జో బైడెన్‌ ఫోన్

ప్రాణం తీసిన స్టంట్‌ !! ఇలాంటి కార్యక్రమాలు నిషేధించాలంటూ నెటిజన్లు డిమాండ్‌

తను చనిపోతూ 48 మంది ప్రాణాలను కాపాడిన బస్సు డ్రైవర్

పాక్‌ నుంచి భారత్‌కు రానున్న అంజు.. మీడియాకు తెలిపిన ఆమె భర్త నస్రుల్లా

ఆరున్నర కోట్ల ఉద్యోగం వదిలేశాడు.. ఆ తర్వాత ??