డేటింగ్‌కి వెళ్లాలి.. సాయం చేయండి..ఎమ్మెల్యేకి యువకుడి విన్నపం
సాధారణంగా యువతీ యువకులు ప్రేమలో పడితే ప్రియురాలి కోరికలు తీర్చడం కోసం యువకులు ఫ్రెండ్స్‌నో, కుటుంబ సభ్యులనో సహాయం అడుగుతారు. కానీ ఇక్కడ ఓ యువకుడు డైరెక్ట్‌గా ఎమ్మెల్యేనే సహాయం అడిగాడు. ఆ యువకుడు తన డ్రీమ్ గర్ల్‌తో డేటింగ్‌కు వెళ్ళేందుకు ఆర్ధిక సాయం కావాలంటూ ఎమ్మెల్యేకి అర్జీ పెట్టుకున్నాడు. ఈ మేరకు ఆ యువకుడు సదరు ఎమ్మెల్యేకి మెయిల్ పెట్టాడట. ఈ విషయం స్వయంగా ఆ ఎమ్మెల్యేనే తన ట్విట్టర్ ఎక్స్ ఖాతాద్వారా నెటిజన్లతో షేర్ చేసుకున్నాడు.
సాధారణంగా యువతీ యువకులు ప్రేమలో పడితే ప్రియురాలి కోరికలు తీర్చడం కోసం యువకులు ఫ్రెండ్స్‌నో, కుటుంబ సభ్యులనో సహాయం అడుగుతారు. కానీ ఇక్కడ ఓ యువకుడు డైరెక్ట్‌గా ఎమ్మెల్యేనే సహాయం అడిగాడు. ఆ యువకుడు తన డ్రీమ్ గర్ల్‌తో డేటింగ్‌కు వెళ్ళేందుకు ఆర్ధిక సాయం కావాలంటూ ఎమ్మెల్యేకి అర్జీ పెట్టుకున్నాడు. ఈ మేరకు ఆ యువకుడు సదరు ఎమ్మెల్యేకి మెయిల్ పెట్టాడట. ఈ విషయం స్వయంగా ఆ ఎమ్మెల్యేనే తన ట్విట్టర్ ఎక్స్ ఖాతాద్వారా నెటిజన్లతో షేర్ చేసుకున్నాడు. ఈ విచిత్ర సంఘటన నాగాలాండ్‌లో జరిగింది. బీజేపీ నాగాలాండ్ అధ్యక్షుడు టెమ్‌జెన్ ఇమ్నా అలోంగ్ తనకు ఎదురైన విచిత్ర అనుభవాన్ని స్వయంగా తన అధికారిక ట్విటర్ ఖాతాలో నెటిజన్లతో పంచుకున్నారు. అరవింద పాండా అనే ఓ యువకుడు తన డ్రీమ్ గర్ల్’తో డేటింగ్ వెళ్లేందుకు ఆర్థిక సాయం కోరుతూ మెయిల్ పెట్టాడట. ఆ మెయిల్‌లో.. సర్.. అక్టోబర్ 31వ తేదీన నా డ్రీమ్ గర్ల్‌తో మొదటిసారిగా డేటింగ్‌కు వెళ్లబోతున్నాను. కానీ ఇప్పటి వరకు నాకు ఉద్యోగం కూడా లేదు. దయచేసి నాకు ఓ చిన్న సాయం చేయండి…ఏదో ఒకటి చేయండి సార్ అంటూ మెయిల్‌లో రాసుకొచ్చాడు. అందుకు ఎమ్మెల్యే నేనేం చేయాలో, ఎలాంటి సాయం కావాలో చెప్పండి అంటూ బదులిచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
60 ఏళ్ల చరిత్రకు ముగింపు.. ఈ ట్యాక్సీలను ఇక చూడలేం
వాళ్లను వదిలేయండి .. ఇజ్రాయెల్ అధ్యక్షుడికి జో బైడెన్ ఫోన్
ప్రాణం తీసిన స్టంట్ !! ఇలాంటి కార్యక్రమాలు నిషేధించాలంటూ నెటిజన్లు డిమాండ్
తను చనిపోతూ 48 మంది ప్రాణాలను కాపాడిన బస్సు డ్రైవర్
పాక్ నుంచి భారత్‌కు రానున్న అంజు.. మీడియాకు తెలిపిన ఆమె భర్త నస్రుల్లా