Golden Guys: శ్రీవారి సన్నిధిలో బంగారు భక్తులు.! ఒంటినిండా కేజీల కొద్దీ ఆభరణాలు..

|

Aug 26, 2024 | 1:11 PM

తిరుమల శ్రీనివాసుడు అలంకార ప్రియుడు.. టన్నులకొద్దీ బంగారు ఆభరణాలు ఆయన సొంతం. వెలకట్టలేని వజ్రవైఢూర్యాలు ధరించి వజ్రకవచ శ్రీనివాసుడిగా దర్శనమిస్తారు. అలాంటి స్వామివారి సన్నిధికి ముగ్గురు భక్తులు వచ్చారు. ఇందులో వింతేముంది అనుకుంటే పొరపాటే.. వారు ఒంటినిండా బంగారు ఆభారణాలు ధరించి స్వామి దర్శనానికి వచ్చారు. ఇతర భక్తులు వారిని విచిత్రంగా చూసారు.

తిరుమల శ్రీనివాసుడు అలంకార ప్రియుడు.. టన్నులకొద్దీ బంగారు ఆభరణాలు ఆయన సొంతం. వెలకట్టలేని వజ్రవైఢూర్యాలు ధరించి వజ్రకవచ శ్రీనివాసుడిగా దర్శనమిస్తారు. అలాంటి స్వామివారి సన్నిధికి ముగ్గురు భక్తులు వచ్చారు. ఇందులో వింతేముంది అనుకుంటే పొరపాటే.. వారు ఒంటినిండా బంగారు ఆభారణాలు ధరించి స్వామి దర్శనానికి వచ్చారు. ఇతర భక్తులు వారిని విచిత్రంగా చూసారు. వారి కారు కూడా బంగారు పూతపూసి ఉండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. తిరుమలపై శ్రీనివాసుని భక్తులను నోరెళ్లబెట్టేలా చేసింది.

మహారాష్ట్రకు పూణెకు చెందిన సన్నీనన వాగ్చోరీ, సంజయ్‌ దత్తాత్రేయ గుజర్‌, ప్రీతి సోని ఒంటినిండా కేజీల కేజీల ఆభరణాలు ధరించి తిరుమల వీధుల్లో దర్శనమిచ్చారు. వీఐపీ బ్రేక్‌ దర్శనం చేసుకున్న వీరు శ్రీవాణిట్రస్ట్‌కు విరాళం కూడా అందజేశారు. వెంకన్నను దర్శించుకున్న అనంతంర మొక్కులు తీర్చుకుని తిరిగి తమ గోల్డ్‌ ప్లేటెడ్‌ కారులో తాము వెంటతెచ్చుకున్న ప్రైవేటు సెక్యూరీటీ వెంటరాగా తిరుగుప్రయాణమయ్యారు. వారు ఒక్కొక్కరు ఒంటిపైన ధరించిన బంగారం 25 కేజీలు తక్కువ ఉండదని చర్చించుకుంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.