Viral Video: మార్క్‌లిస్ట్‌ కోసం స్కూలుకు వెళ్లిన యువతిపై లైంగికదాడి

Viral Video: మార్క్‌లిస్ట్‌ కోసం స్కూలుకు వెళ్లిన యువతిపై లైంగికదాడి

Anil kumar poka

|

Updated on: May 25, 2024 | 5:43 PM

పదో తరగతి మార్క్స్ లిస్ట్ తీసుకునేందుకు పాఠశాలకు వచ్చిన ఓ బాలికపై సహచర విద్యార్థే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బలవంతంగా తరగతి గదిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరో నలుగురు యువకులు ఈ ఘటనను వీడియో తీసి బెదిరింపులకు గురిచేశారు. ప్రస్తుతం అందరూ కటకటాలు లెక్కించుకుంటున్నారు. ఈ ఘటన ఏలూరు జిల్లా మండవల్లి మండలంలో జరిగింది.

పదో తరగతి మార్క్స్ లిస్ట్ తీసుకునేందుకు పాఠశాలకు వచ్చిన ఓ బాలికపై సహచర విద్యార్థే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బలవంతంగా తరగతి గదిలోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. మరో నలుగురు యువకులు ఈ ఘటనను వీడియో తీసి బెదిరింపులకు గురిచేశారు. ప్రస్తుతం అందరూ కటకటాలు లెక్కించుకుంటున్నారు. ఈ ఘటన ఏలూరు జిల్లా మండవల్లి మండలంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక పదో తరగతి మార్కుల జాబితాను తీసుకునేందుకు స్కూలుకు వచ్చింది. ఉపాధ్యాయులు అందుబాటులో లేకపోవడంతో తిరిగి ఇంటికి వెళ్తుండగా అప్పటికే అక్కడున్న సహచర విద్యార్థి ఆమెను తరగతి గదిలోకి లాక్కెళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటనను మరో నలుగురు యువకులు వీడియో తీశారు. ఆ తర్వాత ఆ దృశ్యాలు చూపించి బాలికను లైంగికంగా వేధించడం మొదలుపెట్టారు. అంతేకాదు, వాటిని బాధిత బాలిక తల్లిదండ్రులకు చూపించి డబ్బులు డిమాండ్ చేశారు. రూ. 2 లక్షలు ఇస్తామని చెప్పినా, సరిపోవని, ఇంకా పెద్దమొత్తంలో కావాలని డిమాండ్ చేశారు. అక్కడితో ఆగకుండా వీడియోను వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు. దీంతో బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన బాలుడిని అరెస్ట్ చేసి జువైనల్ హోంకు తరలించారు. వీడియో తీసిన నలుగురు యువకులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.