సింహాలకు చుక్కలు చూపించిన జిరాఫీ.. నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

Updated on: Feb 20, 2025 | 1:10 PM

సింహంతో వేట అంటే మామూలుగా ఉండదు. ఆకలితో ఉన్న సింహం ముందు ఏ జంతువైనా కనిపించిందంటే.. ఆరోజు దాని ఆయుష్షు ముగిసినట్టే. సింహం సింగిల్‌గా వస్తేనే డేంజర్‌.. అలాంటికి గ్రూప్‌గా వస్తే... ఆకలితో ఉన్న సింహాలు కొన్ని ఏదైనా జంతువు కనిపిస్తందేమోనని చూస్తున్నాయి. దూరంగా ఓ జిరాఫీ నీళ్లు తాగుతూ కనిపించింది. తమ పంట పండిందనుకున్నాయి సింహాలు.

నెమ్మదిగా అక్కడ్నుంచి కదిలాయి. మెల్లమెల్లగా జిరాఫీని సమీపించాయి. దగ్గరకు రాగానే సింహాలన్నీ జిరాఫీని రౌండప్‌ చేశాయి. దూరం నుంచే సింహాల రాకను గమనించిన జిరాఫీ సింహాలకు ఊహించని షాకిచ్చింది. సింహాల వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. దీనిపై నెటిజన్లు తమదైనశైలిలో స్పందించారు. సింహాలు రౌండప్‌ చేయడంతో అలెర్ట్ అయిన జిరాఫీ అక్కడి నుంచి పరుగందుకుంది. మరో వైపు సింహాలు కూడా వేగంగా పరుగెడుతూ జిరాఫీని కిందపడేయాలని చూసాయి. కానీ జిరాఫీ సింహాలకు ఏమాత్రం ఛాన్స్‌ ఇవ్వలేదు. శక్తినంతా ఉపయోగించి ధైర్యంగా ముందుకు పరుగుతీసింది. దగ్గరకు వచ్చిన సింహాలను వెనుక కాళ్తతో తన్నుతూ తనను తాను కాపాడుకుంది. అయినా సింహాలు జిరాఫీని వెంటాడుతూనే ఉన్నాయి. కానీ జిరాఫీ సంకల్పంముందు సింహాలు ఓడిపోయాయి. కొంతదూరం జిరాఫీని వెంబడించిన సింహాలు ఇంక లాభం లేదనుకొని ఆగిపోయాయి. దీంతో జిరాఫీ తప్పించుకుంది. సింహాల గుంపు చుట్టుముట్టినా భయపకుండా ప్రాణాలను దక్కించుకున్న జిరాఫీ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే ఈ వీడియోను 9 లక్షలమందికి పైగా వీక్షించారు. వేలాదిమంది లైక్‌ చేసారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ జిరాఫీ పవర్ మామూలుగా లేదుగా.. అంటూ కొందరు, సింహాలకు చుక్కలు చూపించినా జిరాఫీ అని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

5 కేజీల బంగారం నగలు బ్యాగులో పెట్టుకుని స్కూటీపై బయలుదేరాడు.. కొంత దూరం వెళ్లాక

పెన్సిల్‌ కూడా ఎత్తలేం.. భూమిపైకి వచ్చాక గ్రావిటీయే పెద్ద సవాల్‌

చైనాలో భారీ బంగారు గని విలువ ఎన్ని రూ.లక్షల కోట్లంటే

రోజూ 5 నిమిషాలు చేస్తే.. అద్భుతాలు మీ సొంతం

Bird flu: బర్డ్‌ఫ్లూ టెర్రర్.. చికెన్, గుడ్లు తినొచ్చా? వైరస్ వర్రీ ఎప్పటి వరకు?