ప్రియురాలితో ఉండగా భర్తను.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య

Updated on: Feb 27, 2025 | 7:15 PM

అక్రమ సంబంధం పెట్టుకున్న జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ జానకిరామ్‌ను అతడి భార్య రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. జానకిరామ్‌తో పాటు సదరు మహిళను బంధువులు చితకబాదారు. విషయం తెలుసుకున్న వారాసిగూడ పోలీసులు అక్కడికి చేరుకొని వాళ్లిద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

జీహెచ్ఎంసీలో అడ్మిన్ విభాగంలో జాయింట్ కమిషనర్గా పనిచేస్తున్న జానకిరామ్ గత కొంతకాలంగా విధి నిర్వహణ పేరుతో సరిగా ఇంటికి రావడం లేదు. దాంతోపాటు ఫోన్లు సైతం ఎక్కువగా మాట్లాడుతుండడంతో భార్య కల్యాణికి అనుమానం వచ్చింది. దీంతో భర్త పై నిఘా పెట్టిన కళ్యాణి..వారసిగూడలో ఒక అపార్ట్‌మెంట్‌లో తనకన్నా 20 ఏళ్ల వయసు తక్కువగా ఉన్న మహిళ తో జానకిరామ్ కలిసి ఉన్నట్లు గుర్తించింది. శుక్రవారం ఉదయం ఆ అపార్ట్మెంట్‌కు బంధువులతో కలిసి వెళ్లిన కల్యాణి ఆ ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. జానకిరామ్ ఎక్కడ పనిచేసిన అక్కడ ఆఫీసులో ఉన్న అమ్మాయిలతో వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారని ఆరోపించారు. గతంలో పలుమార్లు తాను వారిని పట్టుకున్నట్లు చెప్పారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పురుషులకు శుభవార్త! మహిళల ఉచిత బస్సు ఇబ్బంది ఇక తప్పినట్లే..!

మహిళలకు గుడ్‌న్యూస్.. వారి ఖాతాల్లోకి రూ. 2500