చీరకట్టులో టీ కాచిన విదేశీ కోడలు.. నెట్టింట వీడియో వైరల్..!

చీరకట్టులో టీ కాచిన విదేశీ కోడలు.. నెట్టింట వీడియో వైరల్..!

Phani CH

|

Updated on: Apr 09, 2023 | 9:31 PM

యువతీ యువకుల మధ్య ప్రేమకు హద్దులు ఉండవని.. ఎవరూ బంధించలేరని అంటారు. గత కొన్ని ఏళ్లుగా భారతీయ యువతీయువకులు తమ మనసుకు నచ్చిన మది మెచ్చిన విదేశీ యువతీయువకులను ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నారు.

యువతీ యువకుల మధ్య ప్రేమకు హద్దులు ఉండవని.. ఎవరూ బంధించలేరని అంటారు. గత కొన్ని ఏళ్లుగా భారతీయ యువతీయువకులు తమ మనసుకు నచ్చిన మది మెచ్చిన విదేశీ యువతీయువకులను ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటున్నారు. దీంతో అనేక భారతీయ కుటుంబాల్లో విదేశీ కోడళ్లు, విదేశీ అల్లుళ్లు సభ్యులవుతున్నారు. తాజాగా ఓ విదేశీ కోడలికు చెందిన ఓ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. భారతదేశానికి చెందిన యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జర్మనీ యువతి దేశీ స్టైల్‌లో తనను తాను మలచుకుంది. జూలీ శర్మ.. భారతీయ వ్యక్తిని వివాహం చేసుకుంది. రెండేళ్లుగా రాజస్థాన్ లోని జైపూర్‌లో నివస్తోంది. జూలీ తరచుగా వీడియోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ఆమెకు నెట్టింట మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజాగా వైరల్ అవుతున్న వీడియోలో.. జూలీ తన భర్త కోసం టీ తయారు చేస్తూ వంటగదిలో నిలబడింది. ఇంతలో ఆమె భర్త ఈ దృశ్యాన్ని కెమెరాలో బంధించడానికి వచ్చాడు. ఆమె భర్త వీడియో రికార్డింగ్ చేస్తుండగా.. ఇద్దరూ ఆటపట్టించుకుంటూ మాటల్లో మునిగిపోయారు. ఇంతలో టీ మరిగిపోయి.. పొంగిపోతుంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తుపాకీతో కేక్‌ కటింగ్‌.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌

బాస్‌ నీ ఇడ్లీ ఐడియా అదిరింది.. క్షణాల్లో వందల ఇడ్లీలు

యూట్యూబ్‌ వీడియోస్‌కి తెగ లైక్ కొడుతున్నారా.. జాగ్రత్త

కామెంట్ చేసిన యువకులు.. రోడ్డుపైనే పొట్టుపొట్టు కొట్టిన మహిళ

నాలుగేళ్లకే గిన్నిస్ రికార్టు సాధించి ఔరా అనిపించాడు

 

Published on: Apr 09, 2023 09:31 PM