Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓర్నీ.. వధువుకి పువ్వు ఇవ్వడానికి వరుడు పడిన కష్టం చూస్తే నవ్వాగదు!

ఓర్నీ.. వధువుకి పువ్వు ఇవ్వడానికి వరుడు పడిన కష్టం చూస్తే నవ్వాగదు!

Samatha J
|

Updated on: Jun 17, 2025 | 8:09 AM

Share

ప్రస్తుత కాలంలో పెళ్లిలో జరిగే ప్రతి సన్నివేశం నెట్టింట చేరి నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఓ వివాహ వేడుకలో వధూవరులకు ఫోటోగ్రాఫర్‌ ఫోటోలు తీస్తున్నాడు. వరుడి ఫ్రెండ్‌ ఒకరు వధువుకి పువ్వు ఇస్తూ ఫోజు ఇవ్వమని వరుడికి చెప్పాడు. అతన్ని మోకాలిపై కూర్చుని ఇవ్వమని సూచించాడు. అయితే వరుడికి అలా కూర్చోవడం ఎంతకీ సాధ్యం కాలేదు. ఈ క్రమంలో అతను పడిన అవస్థ చూస్తే నవ్వకుండా ఉండలేరు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వివాహ వేడుక జరుగుతోంది. వేదికపై వధూవరులు ఉన్నారు. వధువుకు గులాబీ పువ్వు ఇచ్చి ప్రపోజ్ చేయాలని వరుడికి అతడి స్నేహితులు సూచించారు. ఎలా ప్రపోజ్ చేయాలో ఓ వ్యక్తి మోకాళ్లపై కూర్చుని చూపించాడు. అయినా వరుడు మాత్రం అలా చేయలేకపోయాడు. మోకాళ్ల మీద కూర్చోవడానికి నానా తంటాలు పడ్డాడు. చివరకు నావల్ల కాదురా బాబు.. అని నిలబడే వధువు చేతికి గులాబీ అందించాడు. అప్‌సెట్ అయిన వధువు తప్పనిసరై ఆ పువ్వును అందుకుంది. ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు దాదాపు 10 లక్షల మందికి పైగా వీక్షించారు. దాదాపు రెండు లక్షలమంది లైక్ చేశారు. ఆ వరుడు ప్రస్తుత ప్రపంచంలో ఉండాల్సిన వాడు కాదు అని ఒకరు కామెంట్ చేశారు. అతడు చాలా అమాయకుడిలా ఉన్నాడు అని మరొకరు స్పందించారు.

మరిన్నివీడియోల కోసం :

ఎప్పుడో తండ్రి చేసిన పనికి.. కొడుకు పంట పండింది వీడియో

రన్నింగ్ ట్రైన్‌లో సెల్పీ తీసుకుంటున్న యువకుడు…అంతలో వీడియో

కొత్త జంటకు ప్రధాని నుంచి ఊహించని కానుక వీడియో