70 సం.ల ప్రేమ.. చివరికి 90 ఏళ్ల వధువును పెళ్లాడిన 95 ఏళ్ల వరుడు
90 ఏళ్ల వధువును 95 ఏళ్ల వరుడు పెళ్లాడాడు. గత 70 ఏళ్లుగా కలిసి సహజీవనం చేస్తున్న ఈ జంట చివరికి ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు. నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు, మనవరాళ్లు, మనవళ్ల సమక్షంలో రమాభాయ్ అంగారి, జీవాలి దేవి పెళ్లి చేసుకున్నారు. రాజస్థాన్‌లోని దుంగార్పూర్ జిల్లా గలందర్ గ్రామంలో బుధవారం ఈ వివాహ వేడుక జరిగింది.
గత 70 ఏళ్లుగా సహజీవనం చేస్తున్న రమాభాయ్ అంగారి, జీవాలి దేవి ఇక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాన్ని కొన్ని రోజుల క్రితమే తమ కుమారులకు తెలిపారు. ఈ అంశంపై గ్రామపెద్దలు, కుటుంబ పెద్దలతో రమాభాయ్ అంగారి కుమారులు మాట్లాడారు. వారి కోరిక మేరకు రమాభాయ్ అంగారి, జీవాలి దేవిలకు పెళ్లి చేయాలని నిర్ణయించారు. జూన్ 1న శుభ ముహూర్తంలో హల్దీ వేడుకను నిర్వహించారు. జూన్ 4న రమాభాయ్ అంగారి, జీవాలి దేవిలకు పెళ్లి చేయించారు. అనంతరం బాజా బజంత్రీల నడుమ నవ దంపతులను గలందర్ గ్రామంలో ఊరేగించారు. ఇందులో గ్రామస్థులు, కుటుంబ సభ్యులు ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. డీజే సాంగ్‌లకు డ్యాన్సు స్టెప్పులు వేశారు. ‘నత ప్రథ’ అనే ప్రాచీన సంప్రదాయం నేటికీ రాజస్థాన్‌లో పలుచోట్ల ఆచరణలో ఉంది. ఈ సంప్రదాయం ప్రకారమే రమాభాయ్ అంగారి, జీవాలి దేవి పెళ్లి చేసుకోకుండానే గత 70 ఏళ్లుగా కలిసి జీవించారు. పురుషుడు, మహిళ పరస్పర అంగీకారంతో పెళ్లి చేసుకోకుండానే కలిసి జీవించవచ్చని ‘నత ప్రథ’ సంప్రదాయం చెబుతోంది. ఇంతకాలం అలానే జీవిస్తున్న రమాభాయ్ అంగారి దంపతుల కుమారులు కుమార్తెలు కలిసి వైభవంగా తమ తల్లిదండ్రుల పెళ్లిని జరిపించారు. ఈ జంట నలుగురు పిల్లలు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వారంలో ఇది 3 సార్లు తినండి.. ఫలితం మీరే చూడండి
రోజూ సపోటా తింటే శరీరంలో అద్భుతమే చేస్తుంది
వంద స్పీడ్‌తో వెళ్తున్న కారు.. గుట్కా ఉమ్మేందుకు డోర్ తెరిచిన డ్రైవర్.. ఏం జరిగిందంటే
టాటూ వేయించుకున్న సురేఖా వాణి.. విషయం తెలియకుండా తప్పుబడుతున్న నెటిజన్స్

ఇదేం వింత సంప్రదాయం.. అక్కడ ప్రతీ పురుషుడికీ ఇద్దరు భార్యలు!

వందేళ్ల ప్రయాణం ముగిసింది.. వైరల్ వీడియో

ప్లాస్టిక్‌ను తినేస్తున్న పురుగులు..వైరల్ వీడియో

ఇది పొగ లేని సిగరెట్ కానీ దీనిని పీల్చరు.. తాగుతారు వీడియో

కుక్కను పెంచుకోవడానికి .. మీ ఇరుగు పొరుగు పర్మిషన్ తప్పనిసరి!

గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మి వెళ్తుండగా.. గుంతలో పడ్డ కారు

బద్ధలవుతున్న అగ్నిపర్వతం సాక్షిగా.. జంట నిశ్చితార్థం
