వంద స్పీడ్‌తో వెళ్తున్న కారు.. గుట్కా ఉమ్మేందుకు డోర్ తెరిచిన డ్రైవర్.. ఏం జరిగిందంటే
వంద కిలోమీటర్ల వేగంతో కారు దూసుకెళ్తోంది. గుట్కా ఉమ్మేందుకు డ్రైవర్ డోర్ తెరిచాడు. దీంతో ఆ కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. కారులో ఉన్న వారు బయటకు ఎగిరిపడ్డారు. ఒకరు మరణించగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. చకర్ భట ప్రాంతానికి చెందిన 31 ఏళ్ల జాకీ గెహి బట్టల వ్యాపారి. ఆదివారం రాత్రి ఒక పార్టీలో పాల్గొన్నారు.
తనను పికప్ చేసుకోవాలని స్నేహితుడు ఆకాష్ చందానీకి జాకీ ఫోన్ చేశారు. దీంతో ఫ్రెండ్ పంకజ్ చాబ్రాతో కలిసి అతడు అక్కడకు చేరుకున్నారు. పార్టీ తర్వాత సోమవారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో ఈ ముగ్గురు ఇన్నోవా కారులో బయలుదేరారు. ఆకాష్ కారు నడపగా ముందు సీటులో పంకజ్, వెనుక సీటులో జాకీ కూర్చొన్నారు. బిలాస్‌పూర్ - రాయ్‌పూర్ హైవేపై వంద కిలోమీటర్ల వేగంతో కారు దూసుకెళుతోంది. డ్రైవ్ చేస్తున్న ఆకాష్ అకస్మాత్తుగా డోర్ తెరిచి గుట్కా ఉమ్మాడు. దీంతో కారుపై నియంత్రణ కోల్పోయాడు. డివైడర్ వైపు దూసుకెళ్లిన కారు పలుసార్లు పల్టీలు కొట్టింది. అందులో ఉన్న ముగ్గురు బయటకు ఎగిరిపడ్డారు. గాల్లోకి ఎగిరిన జాకీ ఒక పోల్‌ను తాకడంతో తీవ్రంగా గాయపడి మరణించాడు. ఆకాష్, పంకజ్ తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు పలుమార్లు పల్టీలు కొట్టిన ఆ కారు చివరకు ఆగి ఉన్న మరో కారును ఢీకొట్టింది. దీంతో అందులో ఉన్న డ్రైవర్ కూడా గాయపడ్డాడు. ఈ ప్రమాదంలో ఇన్నోవా కారు పూర్తిగా ధ్వంసమైంది. గాయపడిన వారిని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టాటూ వేయించుకున్న సురేఖా వాణి.. విషయం తెలియకుండా తప్పుబడుతున్న నెటిజన్స్
బాలీవుడ్ రామాయణలో శూర్పణఖగా టాలీవుడ్ స్టార్ హీరోయన్ ??
ఎవరెస్ట్ శిఖరం వద్ద కింగ్ కోబ్రాస్ కలకలం! ప్రమాదపు అంచున ఉన్నామా..?
కోతుల వీరంగానికి కొండముచ్చుతో చెక్.. గ్రామాల్లో కొత్త ట్రెండ్
సూది అవసరం లేకుండా రక్త పరీక్షలు.. AIతో టెస్టులు రిపోర్టులు..

3 ఏళ్ల నిషేధం తర్వాత మళ్లీ ఫ్రీ ఫైర్ గేమింగ్.. ఎప్పటి నుంచి అంటే

ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి

నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా

ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో

పరీక్షలో ఫెయిలయ్యాడని పొట్టుపొట్టుగా కొట్టిన తండ్రి.. కట్‌చేస్తే

ఒంటె కన్నీటికి ఇంత శక్తి ఉందా..వీడియో

విమానం నుంచి దూకేసిన ప్రయాణికులు.. ఎందుకంటే?

అంతరిక్షంలో అంత్యక్రియలు.. అంతలోనే గంగపాలు వీడియో

సినిమాల్లో నటించాలనుకునే వారికి సూపర్ డూపర్ ఛాన్స్..

ప్రేమోన్మాది ఘాతుకం.. యువతిని పొడిచి.. రక్తపు మడుగులో తాళి కట్టి

నా పిల్లిని చూసుకోండి.. కోట్లు అందుకోండి.. అబ్బా బంపర్ ఆఫర్ మామా

ఇది ఇల్లేనా ?? ఇలా కట్టారేంటి ?? ఎవరైనా ఉంటారా దీనిలో
