వారంలో ఇది 3 సార్లు తినండి.. ఫలితం మీరే చూడండి
మీల్ మేకర్.. వెజీటెరియన్ వాళ్లకు మాంసానికి ప్రత్యామ్నాయంగా దీనిని పిలుస్తారు. మీల్ మేకర్‌ను సోయా చంక్స్ అని కూడా పిలుస్తుంటారు. ఈ ఆరోగ్యకరమైన మీల్ మేకర్‌ను సోయాతో తయారు చేస్తారు. మీల్ మేకర్‌లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కొవ్వు ఉండదు. ప్రొటీన్, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, జింక్, సెలీనియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
మీల్ మేకర్‌ను తరచుగా మన డైట్‌లో చేర్చుకుంటే.. ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.ప్రొటీన్.. అత్యధికంగా ఇచ్చే ఆహారాల్లో సోయా చంక్స్ ఒకటి. వెజిటేరియన్ మటన్ గా పిలిచే దీని వల్ల మజిల్స్ ఆరోగ్యవంతంగా పెరుగుతాయి. ఇందులో తక్కువ క్యాలరీలు, ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. కాల్షియం, ఐరన్ అధికంగా ఉండడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఇది..డయాబెటిక్ ఫ్రెండ్లీ ఫుడ్ అంటున్నారు నిపుణులు. అంతేకాదు, ఇవి తినడం వల్ల అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తుంది. శరీరంలో రక్త ప్రసరణను నిర్వహించడంతో పాటు వివిధ సీజనల్ సమస్యలను దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మీల్ మేకర్ తినటం వల్ల మహిళల్లో ఎముకలకు బలాన్నిస్తుంది. ఎముకల దృఢత్వాన్ని పెంచుతుంది. ఈ పోషకమైన మీల్ మేకర్ అన్ని వయసుల వారికి సమానంగా ప్రయోజనాలను అందిస్తుంది. వీటిలో చికెన్, మటన్, గుడ్లు కంటే ఎక్కువ ప్రొటీన్ ఉంటుంది. వెజిటేరియన్స్ వీటిని మాంసానికి ప్రత్యామ్నాయంగా తీసుకోవచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా ప్రొటీన్ లోపంతో బాధపడేవారు.. మీల్ మేకర్ తీసుకుంటే మంచిదని చెబుతున్నారు. రోజుకి ఒక కప్పు సోయా చంక్స్ ని ఉడికించి కూర లేదా సలాడ్ రూపంలో తినాలి. ఎంత మంచిదైనా ఎక్కువగా తినకుండా పరిమితంగా తీసుకోవాలన్న విషయం గుర్తుంచుకోండి. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రోజూ సపోటా తింటే శరీరంలో అద్భుతమే చేస్తుంది
వంద స్పీడ్‌తో వెళ్తున్న కారు.. గుట్కా ఉమ్మేందుకు డోర్ తెరిచిన డ్రైవర్.. ఏం జరిగిందంటే
టాటూ వేయించుకున్న సురేఖా వాణి.. విషయం తెలియకుండా తప్పుబడుతున్న నెటిజన్స్
బాలీవుడ్ రామాయణలో శూర్పణఖగా టాలీవుడ్ స్టార్ హీరోయన్ ??
ఎవరెస్ట్ శిఖరం వద్ద కింగ్ కోబ్రాస్ కలకలం! ప్రమాదపు అంచున ఉన్నామా..?

ఇదేం వింత సంప్రదాయం.. అక్కడ ప్రతీ పురుషుడికీ ఇద్దరు భార్యలు!

వందేళ్ల ప్రయాణం ముగిసింది.. వైరల్ వీడియో

ప్లాస్టిక్‌ను తినేస్తున్న పురుగులు..వైరల్ వీడియో

ఇది పొగ లేని సిగరెట్ కానీ దీనిని పీల్చరు.. తాగుతారు వీడియో

కుక్కను పెంచుకోవడానికి .. మీ ఇరుగు పొరుగు పర్మిషన్ తప్పనిసరి!

గూగుల్ మ్యాప్స్ ను గుడ్డిగా నమ్మి వెళ్తుండగా.. గుంతలో పడ్డ కారు

బద్ధలవుతున్న అగ్నిపర్వతం సాక్షిగా.. జంట నిశ్చితార్థం
