వామ్మో.. అంతటి జెర్రిపోతును అమాంతం మింగేసిందిగా వీడియో
జెర్రిపోతు వర్సెస్ కింగ్ కోబ్రా.. ఒక పాముది జీవన పోరాటం.. మరొక పాముది ఆకలికోసం ఆరాటం.. ఇలా రెండు పాముల మధ్య భీకర పోరాటం జరిగింది. చివరకు ఆ గిరినాగు ముందు జెర్రిపోతు తలవంచక తప్పలేదు. అంతటి జెర్రిపోతును అమాంతంగా మింగేసింది ఆ భారీ నాగు పాము. మళ్లీ ఏమనుకుందో ఏమో కానీ.. మింగిన జెర్రిపోతును అక్కడే బయటకు కక్కి వెళ్లి పోయింది. ఈ షాకింగ్ ఘటన తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేట మల్లెపుట్టు ప్రాంతంలో చోటుచేసుకుంది.
ఓ పొలంలో కింగ్ కోబ్రా, జెర్రిపోతు.. రెండు పాములు కలబడ్డాయి. అరగంటపాటు రెండు పాముల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. స్థానిక రైతు భాస్కర్ రావు పొలంలో ఘటన జరగ్గా.. అక్కడే ఉన్న ఓ వ్యక్తి.. ఈ ఘటనను తన ఫోన్ లో రికార్డు చేశాడు. భారీ పొడవున్న నాగుపాము ఒక మీటరు పొడవున్న జెర్రిపోతు ను వేటాడింది. పచ్చటి పంట పొలాల్లో నిదానంగా ముందుకెళ్లిన నాగుపాము ఒక్కసారిగా జెర్రిపోతుపై దూకింది. వేగంగా దాన్ని పట్టుకొని తీవ్రంగా ఉక్కిరిబిక్కిరి చేసింది. చివరకు జెర్రిపోతు ప్రాణాలు విడిచింది. నాగుపాము దాన్ని మింగడం ప్రారంభించింది. అయితే పామును మింగిన అనంతరం.. దానిని మళ్లీ బయటకు కక్కేసి వెళ్లిపోయింది కింగ్ కోబ్రా. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసి నెటిజన్లు ఒక పాము మరో పామును మింగడమా..అంటూ ఆశ్చర్యపోతున్నారు.
మరిన్నివీడియోల కోసం :
ఎప్పుడో తండ్రి చేసిన పనికి.. కొడుకు పంట పండింది వీడియో
రన్నింగ్ ట్రైన్‌లో సెల్పీ తీసుకుంటున్న యువకుడు…అంతలో వీడియో
కొత్త జంటకు ప్రధాని నుంచి ఊహించని కానుక వీడియో
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

