Viral Video: యువతి సాహసం.. కోబ్రాను ఇలా ప‌ట్టుకొని.. వీడియో వైరల్‌

Viral Video: యువతి సాహసం.. కోబ్రాను ఇలా ప‌ట్టుకొని.. వీడియో వైరల్‌

Phani CH

|

Updated on: Feb 22, 2022 | 9:55 AM

సాధార‌ణంగా ఉద్యోగాలు అన్నిట్లోకి కష్ట‌మైన ఉద్యోగం స్నేక్ క్యాచింగ్‌. ఏ మాత్రం అజాగ్ర‌త్త‌గా ఉన్నా ప్రాణాలు పోతాయి. అయితే, కొంత‌మంది ఇలాంటి రిస్క్ ఉన్న ఉద్యోగాల‌ను కూడా చాలా ఇష్టంగా చేస్తూ విజయాలు సాధిస్తుంటారు.

సాధార‌ణంగా ఉద్యోగాలు అన్నిట్లోకి కష్ట‌మైన ఉద్యోగం స్నేక్ క్యాచింగ్‌. ఏ మాత్రం అజాగ్ర‌త్త‌గా ఉన్నా ప్రాణాలు పోతాయి. అయితే, కొంత‌మంది ఇలాంటి రిస్క్ ఉన్న ఉద్యోగాల‌ను కూడా చాలా ఇష్టంగా చేస్తూ విజయాలు సాధిస్తుంటారు. అలాంటి వారిలో రోహిణి ఒక‌రు. కేర‌ళ‌కు చెందిన రోహిణి అట‌వీశాఖ‌లో ఉద్యోగిని. ఉద్యోగంలో భాగంగా రోహిణి స్నేక్ క్యాచింగ్‌లో శిక్ష‌ణ పొందింది. తన ఇంటి చుట్టుప‌క్క‌ల ప్రాంతాల్లో పాములు క‌నిపిస్తే వాటిని ప‌ట్టుకొని అడ‌విలో వదిలేస్తుంటుంది. కాగా.. క‌ట్ట‌క్క‌డ ప్రాంతంలోని ఓ ఇంట్లోకి విష‌స‌ర్పం కోబ్రా రావ‌డం గ‌మ‌నించిన ప్ర‌జ‌లు వెంట‌నే రోహిణీకి స‌మాచారం అందించారు.