Food Delivery Boy: డెలివరీ బాయ్‌ ఫ్యామిలీ వీడియో.. వైరల్‌ ఎందుకైందంటే..!

|

Jul 14, 2023 | 9:42 PM

సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఓ వీడియో చాలామందిని ఆకట్టుకుంటోంది. తాజాగా ఢిల్లీ విమెన్‌ కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వాతి మలివాల్‌ తన ట్విట్టర్‌ హ్యాండిల్‌లో ఒక జంటకు సంబంధించిన వీడియోను షేర్‌ చేశారు. ఇది ఆ దంపతుల ప్రేమకు ప్రతీకగా కనిపిస్తుంది.

ఈ వీడియోలో జొమాటో డెలివరీ ఏజెంట్‌ తన పనంతా అయి, చీకటిపడ్డాక తన భార్య, పిల్లాడితో పాటు ఇంటికి వెళుతుంటాడు. జొమాటో టీషర్టు ధరించిన ఆ వ్యక్తి ఒక పిల్లవాడిని ఎత్తుకుంటాడు. అతని భార్య సైకిల్‌ హ్యాండిల్‌ పట్టుకుని దానిని ముందుకు నడుపుతుంటుంది. కుటుంబం కోసం కష్టిస్తున్న భర్త, అతనికి సాయం అందిస్తున్న భార్యతో కూడిన ఈ వీడియో హృదయాలకు హత్తుకునేలా ఉంది. ఈ వీడియోను జాగ్రత్తగా గమనిస్తే ఆ మహిళ తమ పిల్లాడితో పనికి వెళ్లిందని, భర్త సైకిల్‌పై జొమోటా డెలివరీ చేస్తున్నాడని అర్థం అవుతుంది. ఇద్దరి పనులు ముగిశాక రాత్రి ముగ్గురూ కలిసి ఇంటికి చేరుకుంటున్నారని అర్థం చేసుకోవచ్చు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Tamannaah: సిగ్గెందుకు..? నా ప్రియుడితోనే శృంగార సీన్లు చేశాగా..: తమన్నా
Lokesh Kanagaraj – Prabhas: లోకి with ప్రభాస్‌..డెడ్లీ కాంబో.. ఇక పునకాలే..! గెట్ రెడీ..!
Viral Video: ‘నన్నే డబ్బులు అడుగుతావా.. నీ షాపు ఎలా తెరుస్తావో చూస్తా..! ఓ పోలీస్‌ ఓవరాక్షన్‌...