Follow your Mother:హుందాగా తల్లి సింహం..వెనుకే ముద్దులొలికే చిన్న పిల్లలు..ఈ వీడియో సందేశాన్ని మిస్ కాకండి Viral Video

Follow your Mother: ప్రపంచంలో ఎన్నో అందాలు ఉంటాయి. దేని తీరు దానిదే. అయితే, మృగరాజు సింహం తీరు మాత్రం ఏ ఒక్క అరణ్య ప్రాణికీ ఉండదు. సింహం నడుస్తూ వెళుతుంటే చూడటానికి చాలా మంది ఇష్టపడతారు.

Follow your Mother:హుందాగా తల్లి సింహం..వెనుకే ముద్దులొలికే చిన్న పిల్లలు..ఈ వీడియో సందేశాన్ని మిస్ కాకండి Viral Video
Follow Your Mother
Follow us
KVD Varma

|

Updated on: May 14, 2021 | 9:39 PM

Follow your Mother: ప్రపంచంలో ఎన్నో అందాలు ఉంటాయి. దేని తీరు దానిదే. అయితే, మృగరాజు సింహం తీరు మాత్రం ఏ ఒక్క అరణ్య ప్రాణికీ ఉండదు. సింహం నడుస్తూ వెళుతుంటే చూడటానికి చాలా మంది ఇష్టపడతారు. అంత అందంగా నడుస్తుంది. ఇక సృష్టిలో మనం అనుసరించదగ్గ అతి ముఖ్యమైన వారు ఎవరన్నా ఉన్నారంటే అది తల్లి మాత్రమే. తల్లిని అనుసరిస్తూ పోతే మనకు ఏం జరిగినా అడ్డుగోడలా నిలబడేది తల్లి ఒక్కతే. ఆమె ప్రేమ ఒక్కటే. అది మానవులకే కాదు జంతువులకూ వర్తిస్తుంది. ముఖ్యంగా బాల్యంలో తల్లిని వదలకుండా అనుసరిస్తే జీవిత పాఠాలు దానికి అవే నేర్చేసుకోవచ్చు. ఇదంతా ఎందుకంటే.. ఇప్పుడు మీరు చూడబోయే వీడియోను పరిచయం చేయడానికే. హుందాగా నడిచే తల్లి సింహాన్ని అనుసరిస్తున్న ముద్దులొలికే సింహం పిల్లల వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. కేవలం 9 సెకన్ల ఈ వీడియో చూస్తే మన మనసు చక్కని అనుభూతితో నిండిపోతుంది. అందుకే ముందు మీరు ఈ ట్వీట్ లో ఉన్న వీడియో చూసేయండి.. తర్వాత మిగిలిన విషయాలు చెప్పుకుందాం..

ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్‌కు చెందిన సుశాంత నందా ఈ వీడియోను ట్వీట్ చేశారు. క్లిప్లో ఒక సింహరాశి ఆమె రెండు పిల్లలు ఆమెను అనుసరిస్తుండగా ఒక దారిలో నడుస్తుంది. అందమైన చిన్న పిల్లలు చూస్తుంటేనే ముద్దు వచ్చేస్తున్నాయి కదా. ఇటువంటివి మనం ఇలా వీదియోల్లోనే చూడగలం అందుకే, మీకోసం ఈ వీడియో ఇక్కడ ఇచ్చాం. సుసాంత నందా పోస్ట్ శీర్షికలో, “మీ తల్లిని అనుసరించండి. మీరు ఎప్పటికీ తప్పు చేయరు. ” ఇది నూరు శాతం నిజం కదా! ఇప్పటివరకూ ఈ వీడియో 15,000 వీక్షణలు, 2,000 లైక్‌లు, అలాగే అనేక రీట్వీట్‌లతో వైరల్ అయ్యింది. సోషల్ మీడియా వినియోగదారులు హార్ట్ ఎమోటికాన్‌లను పోస్ట్ చేసి, వారి ఆలోచనలను పోస్ట్‌లోని వ్యాఖ్యల విభాగంలో పంచుకున్నారు.

Also Read: Private: Viral Video : డ్రైవర్ లేకుండా నడుస్తున్న కారు..! వెనుక సీటులో కూర్చున్న యజమాని.. వీడియో వైరల్..

Viral Video: కుక్కని కుక్కా అన్నందుకు..ఆరుగురి తలలు పగలగొట్టారు… ( వీడియో )