Viral Video: క్రొయేషియాలో పడ్డ వింత వస్తువు..UFO అంటూ అనుమానాలు..! కానీ అసలు మేటర్ ఏంటంటే..!(వీడియో)
క్రొయేషియా రాజధాని జాగ్రెబ్ శివార్లలో అర్థరాత్రి గుర్తు తెలియని వస్తువు ఒకటి ఆకాశం నుంచి కుప్పకూలింది. పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది, అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కూలిపోయిన వస్తువు గురించి రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి.
క్రొయేషియా రాజధాని జాగ్రెబ్ శివార్లలో అర్థరాత్రి గుర్తు తెలియని వస్తువు ఒకటి ఆకాశం నుంచి కుప్పకూలింది. పెద్ద శబ్దంతో పేలుడు సంభవించింది, అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. కూలిపోయిన వస్తువు గురించి రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. రష్యా, ఉక్రెయిన్‌కి చెందిన డ్రోన్ అని కొందరు అంటుంటే.. చిన్న విమానం అని మరికొందరు, కాదు యూఎఫ్ఓ అని చెప్పుకొస్తున్నారు.వస్తువు కూలిన చోట భారీ గొయ్యి పడినట్లు అధికారులు నిర్ధారించారు. అలాగే రెండు పారాచూట్‌లు కూడా ఉన్నట్లు గుర్తించారు. అయితే, ఈ పేలుడు కారణంగా అక్కడ పార్క్ చేసిన కొన్ని కార్లు తీవ్రంగా దెబ్బ తిన్నాయి. ప్రమాదం జరిగిన ప్రదేశానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. భారీ లోహపు ముక్కలు, విమానం రెక్కలను పోలిన శిథిలాలు ఆ ఫోటోలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కాగా, అధికారులు ఈ ప్రాంతాన్ని సీజ్ చేసి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అసలక్కడ ఏం కూలింది అనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు. Tu-141 సోవియట్ కాలానికి చెందిన హై-స్పీడ్ క్షిపణి లాంటి డ్రోన్. దీనిని ఉక్రెయిన్ ఉపయోగించినట్లు అధికారులు నిర్ధారించారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
NTR-Ram Charan-RRR: ఒకరు మన్యం ధీరుడు.. మరొకరు గిరిజన వీరుడు.. రామ్ భీమ్‌ల మధ్య స్నేహం..
Alia Bhatt: చీరకట్టులో సీతమ్మ.. అమ్మడి అందాలు అదుర్స్.. అలియా లేటెస్ట్ ఫోటోస్..
Anasuya Bharadwaj: రంగమ్మ అత్తలో మరో కోణం.. బట్టబయలు అవుతున్న అనసూయ నటవిశ్వరూపం.. (ఫొటోస్)
anupama parameswaran: చూసిన తనివి తీరని చీరకట్టులో అనుపమ అందాల ఒంపు సొంపులు..(ఫొటోస్)