యూపీలో తేలియాడే రామసేతు రాయి !! భక్తుల పూజలు

|

Aug 13, 2022 | 9:34 AM

ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లా లోని ఇసాన్ , నదిలో తేలుతున్న రాయి ఒకటి కొట్టుకొచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది,

ఉత్తరప్రదేశ్‌లోని మెయిన్‌పురి జిల్లా లోని ఇసాన్ , నదిలో తేలుతున్న రాయి ఒకటి కొట్టుకొచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది, దానిపై రామ్ అని వ్రాసి ఉండటమే కాకుండా ఆ రాయి నీటిలో మునిగిపోకుండా తేలడం వింతగా మారింది. ఈ రాయి దాదాపు 6 కిలోల బరువు ఉన్నట్లుగా నిర్ధారించారు. నీటిలో తేలియాడే ఈ రాయిని చూసేందుకు ప్రజలు తండోపతండాలుగా వస్తున్నారు. అయితే ఈ రాయిని రామ రావణ యుద్ధంలో నల నీలులు నిర్మించిన రామసేతు వంతెనకు చెందిన రాయిగా ప్రజలు విశ్వసిస్తున్నారు. ఈ రాయిని ఆలయంలో ఉంచి స్థానికులు పూజలు జరుపుతున్నారు. ఇసాన్ నది థానా బేవార్ ప్రాంతంలోని అహ్మల్‌పూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జులై 30వ తేదీ ఉదయం గ్రామానికి చెందిన కొందరు చిన్న పిల్లలు నదిలో చేపలు పట్టుకుంటునేందుకు వెళ్లారు. ఈ క్రమంలో నది ఒడ్డున ఓ నల్లరాయి తేలుతూ కనిపించింది. పిల్లలు నది నుండి రాయిని బయటకు తీశారు, దానిపై రామ్ అని వ్రాసి ఉంది. దాంతో ఈ రాయిని చూసేందుకు చుట్టుపక్కల ప్రాంతాలనుంచి జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

చీకట్లో ఒక్కసారిగా ఎదురుపడిన దెయ్యం !! ఆ యువకుడు ఏంచేశాడో చూడండి.

మనిషిలా కూర్చుని ఆహారం తింటున్న మేక !! నెట్టింట వీడియో వైరల్

హోం వర్క్‌ చేయలేక విసిగిపోయిన కుర్రాడు !! ఈ లోకం విడిచిపోతానంటూ అమ్మపై ఆగ్రహం

సెలయేట్లో ఎలుగుబంట్ల గెట్‌ టుగెదర్‌ !! ట్వీట్లతో హోరెత్తిస్తున్న నెటిజన్లు

రాలిన ఆకులా ఉన్న జీవి !! విశాఖ తీరంలో ప్రత్యక్షం

 

Follow us on