కాపురాల్లో చిచ్చు పెడుతున్న ఈగలు.. భర్తలను వదిలి వెళ్తున్న భార్యలు !!

కాపురాల్లో చిచ్చు పెడుతున్న ఈగలు.. భర్తలను వదిలి వెళ్తున్న భార్యలు !!

Phani CH

|

Updated on: Dec 17, 2022 | 9:46 AM

చెవిలో జోరీగ పోరు మాత్రమే కాదు.. ఊర్లో ఈగల పోరు కూడా భరించలేము అంటున్నారు ఆ గ్రామస్థులు. అంతేకాదు ఈగల బాధను తట్టుకోలేక.. ఈ భర్తలతో మేము కాపురం చేయలేమంటూ ఆ ఊరిలోని కోడళ్లు పుట్టింటి వెళ్లిపోతున్నారు..

చెవిలో జోరీగ పోరు మాత్రమే కాదు.. ఊర్లో ఈగల పోరు కూడా భరించలేము అంటున్నారు ఆ గ్రామస్థులు. అంతేకాదు ఈగల బాధను తట్టుకోలేక.. ఈ భర్తలతో మేము కాపురం చేయలేమంటూ ఆ ఊరిలోని కోడళ్లు పుట్టింటి వెళ్లిపోతున్నారు.. ఆ ఊర్లోని యువతి యువకులను పెళ్లిళ్లు చేసుకోవడానికి చుట్టుపక్కల వారు ఎవరూ ముందుకు రావడం లేదు.. ఇలా ఈగల బారిన పడి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 10 గ్రామాలు బాధపడుతున్నాయి. ఈ వింత ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఉత్తర్‌ప్రదేశ్‌ హర్డోయ్‌ జిల్లాలో అహిరోరి బ్లాక్‌లో కొన్ని గ్రామాల్లో ఈగల బాధ ఎక్కువైంది. 2014లో ఈ ప్రాంతంలో కమర్షియల్‌ పౌల్ట్రీ ఫారం ప్రారంభించిన తర్వాత కాలుష్యం పెరిగిందని గ్రామాలు ఈగలకు నిలయాలుగా మారాయని ఆవేదన వ్యక్తంచేసారు. గత మూడేళ్లలో ఈగలు విపరీతంగా పెరిగిపోయాయని, దాంతో పరిస్థితి మరింత దిగజారిందని గ్రామస్థులు వాపోతున్నారు. ఈగల రొదతో గ్రామస్థులు నరకయాతన అనుభవిస్తున్నారు. భోజనం చేస్తున్నా, నిద్రపోతున్నా ఏపని చేస్తున్నా ఈగలు చుట్టుముడుతుండంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రాక్షస్‌, బుక్కడ్‌ బాబా, రేల్‌ మాఫియా.. పాట్నా వీధుల్లో వింత బోర్డులు !!

యువ‌తకు సర్కార్ న్యూఇయర్ కానుక.. ఉచితంగా కండోమ్స్‌..

Bigg Boss Sohel: సోహైల్ ఆత్మహత్యాయత్నం.. డిప్రెషనే కారణం..

అన్‌స్టాపబుల్ షోకు పవన్‌ కళ్యాణ్ !! ఎప్పుడంటే ??

 

Published on: Dec 17, 2022 09:46 AM