రాక్షస్‌, బుక్కడ్‌ బాబా, రేల్‌ మాఫియా.. పాట్నా వీధుల్లో వింత బోర్డులు !!

రాక్షస్‌, బుక్కడ్‌ బాబా, రేల్‌ మాఫియా.. పాట్నా వీధుల్లో వింత బోర్డులు !!

Phani CH

|

Updated on: Dec 17, 2022 | 9:44 AM

రాక్షస్‌, 53, పోర్టుశ్‌.. ఇవేవో సినిమా పేర్లు లాగా అనిపిస్తున్నాయి కదా. వాస్తవానికి ఇవన్నీ రెస్టారెంట్ల పేర్లు. బీహార్‌ రాజధాని పాట్నా వీధుల్లో తిరిగే ప్రజలకు ఈ బోర్డులు సుపరిచతమే..

రాక్షస్‌, 53, పోర్టుశ్‌.. ఇవేవో సినిమా పేర్లు లాగా అనిపిస్తున్నాయి కదా. వాస్తవానికి ఇవన్నీ రెస్టారెంట్ల పేర్లు. బీహార్‌ రాజధాని పాట్నా వీధుల్లో తిరిగే ప్రజలకు ఈ బోర్డులు సుపరిచతమే.. ఎక్కడ చూసినా ఇలాంటి బోర్డులు విరివిగా కనిపిస్తాయి. పాట్నాకు చెందిన ఆకాశ్‌ అనే వ్యక్తి తాను కొత్తగా మొదలుపెట్టే రెస్టారెంట్‌కు కస్టమర్లను రప్పించేందుకు వినూత్నంగా అలోచించాడు. తన రెస్టారెంట్లకు కాస్త వెరైటీగా పేరు పెట్టాలనుకున్నాడు. ‘రాక్షస్‌’ అనే పేరుతో కేఫ్‌ను ప్రారంభించాడు. ‘ఖావో కుంభకరణ్‌ కే జైసా’ అని ట్యాగ్‌లైన్‌ పెట్టించాడు. కేఫ్‌ నేమ్‌ బోర్డ్‌ చూసిన భోజన ప్రియులకు… ఇదేదో బాగుందే అంటూ ఆ రెస్టారెంట్‌కు ఎగబడి వెళ్తున్నారట. అదే ప్రాంతంలో ‘53’ అనే మరో టేకేవే కేఫ్‌ కూడా పోటీకి వచ్చింది. ఇది కూడా స్థానికంగా చాలా ప్రాచుర్యం పొందింది. ‘పోర్టుశ్‌’ కేఫ్‌ కూడా పేరుతోనే చాలా పేరుగాంచింది. బుక్కడ్‌ బాబా, రేల్‌ మాఫియా, చుల్హా, నాన్సెన్స్‌ రెస్టారెంట్ల పేర్లు చూసి వాటిని కస్టమర్లు బాగా ఆదరిస్తున్నారు. తమ కేఫ్‌లకు కాస్త భిన్నంగా పేర్లు పెట్టడం వల్ల తమ బ్రాండ్‌ రెప్యుటేషన్‌ పెరుగుతోందని యజమానులు చెబుతున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

యువ‌తకు సర్కార్ న్యూఇయర్ కానుక.. ఉచితంగా కండోమ్స్‌..

Bigg Boss Sohel: సోహైల్ ఆత్మహత్యాయత్నం.. డిప్రెషనే కారణం..

అన్‌స్టాపబుల్ షోకు పవన్‌ కళ్యాణ్ !! ఎప్పుడంటే ??

Published on: Dec 17, 2022 09:44 AM