Fish rain: ఆ జిల్లాలో చేపల వర్షం.. రోడ్లపై కుప్పలు తెప్పలుగా చేపలు.. ఎగబడిన జనం..
తెలంగాణలో చేపల వర్షం కురిసింది. మీరు విన్నది నిజమే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చేపల వర్షం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది.
తెలంగాణలో చేపల వర్షం కురిసింది. మీరు విన్నది నిజమే.. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చేపల వర్షం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. భారీ వర్షానికి కొన్ని చోట్ల చేపలు నేలపైకి వచ్చాయి. రోజుకో చోట ఇలా చేపల వర్షం కురుస్తోందని లోకల్స్ చెబుతున్నారు. తాజాగా మహదేవపూర్ మండలం అన్నారంలో మంగళవారం రాత్రి చేపల వర్షం కురిసింది. పలువురి ఇళ్లముందు ఉదయాన్నే చేపలు కనిపించాయి. రోడ్లపైన కూడా కుప్పుల తెప్పలుగా చేపలు కనిపించాయి. దాంతో స్థానిక ప్రజలంతా ఆశ్చర్యపోయారు. అధిక బరువున్న చేపలను కొందరు పట్టుకొని ఇళ్లకు తీసుకెళ్లారు. ఈ విషయంపై జిల్లా మత్స్యశాఖ అధికారులు స్పందించారు. సముద్ర తీర ప్రాంతాల్లో, నదులు, చెరువుల్లో సుడిగాలులు వచ్చిన సమయంలో నీటితో పాటు చేపలు ఎగిరి మేఘాలలో చిక్కుకుంటాయని.. అక్కడే ఘనీభవించి కొద్దిదూరం ట్రావెల్ చేస్తాయని చెప్పారు. ఆ మేఘాలు కరిగి వర్షంగా కురిసినప్పుడు వాటిలోని చేపలు కూడా నేలమీద పడతాయని తెలిపారు. అయితే అన్నారంలో చేపల వర్షం కురిసిందని చెప్పలేమన్నారు. ఈ చేపలను వాడుక భాషలో నటు గురక అని.. శాస్త్రీయ నామం అనాబస్ టెస్ట్‌ట్యూడియస్ అని వెల్లడించారు. ఇవి చిన్నపాటి నీళ్ల ధార ఉన్నా పాకుకుంటూ నేలపైకి వస్తాయని వివరించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Car – ambulance: అంబులెన్స్‌తో రేస్ పెట్టుకుని కారు డ్రైవర్.. సీన్ కట్ చేస్తే షాకింగ్ ఘటన.!
Employee: ఎంప్లాయి అంకితభావానికి సంస్థ సత్కారం.. ఒక్క ఆఫ్ లేకుండా 27 ఇయర్స్..
Omelette challenge: ఈ ఆమ్లెట్ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా

