Curd Rice in USA: అమెరికాలో మన చద్దన్నానికి యమా క్రేజ్‌.! చద్దన్నం ధర తెలిస్తే షాకే.!

Curd Rice in USA: అమెరికాలో మన చద్దన్నానికి యమా క్రేజ్‌.! చద్దన్నం ధర తెలిస్తే షాకే.!

Anil kumar poka

|

Updated on: Jan 05, 2024 | 5:51 PM

ఒకప్పుడు రాత్రి మిగిలిన అన్నాన్ని చద్ది అన్నంగా మార్చుకొని అందులోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి నంజుకుని పొద్దున్నే తినేవాళ్లు. అంతా ఇదే పద్ధతిని పాటించేవారు. ఇప్పుడు ఇడ్లీ, దోశ, వడ అంటూ టిఫిన్స్‌వైపు మొగ్గుచూపుతున్నారు. ఇప్పుడు చద్దన్నం అన్నమాటే వినిపించడం లేదు. గ్రామాల్లో సైతం ఉదయం టిఫిన్స్‌నే తింటున్నారు. కానీ కరోనా మహమ్మారి పుణ్యమా అని చాలా మంది మళ్లీ పాత అలవాట్లవైపు మొగ్గుచూపుతున్నారు. గ్రామాల్లో అక్కడక్కడా కనిపించే ఈ చద్దన్నం సంస్కృతి..

ఒకప్పుడు రాత్రి మిగిలిన అన్నాన్ని చద్ది అన్నంగా మార్చుకొని అందులోకి ఉల్లిపాయ, పచ్చిమిర్చి నంజుకుని పొద్దున్నే తినేవాళ్లు. అంతా ఇదే పద్ధతిని పాటించేవారు. ఇప్పుడు ఇడ్లీ, దోశ, వడ అంటూ టిఫిన్స్‌వైపు మొగ్గుచూపుతున్నారు. ఇప్పుడు చద్దన్నం అన్నమాటే వినిపించడం లేదు. గ్రామాల్లో సైతం ఉదయం టిఫిన్స్‌నే తింటున్నారు. కానీ కరోనా మహమ్మారి పుణ్యమా అని చాలా మంది మళ్లీ పాత అలవాట్లవైపు మొగ్గుచూపుతున్నారు. గ్రామాల్లో అక్కడక్కడా కనిపించే ఈ చద్దన్నం సంస్కృతి ఇప్పుడు నగరాలకు పాకింది. చద్దన్నంలో రోగనిరోధక శక్తి ఉంటుందని నిపుణులు సూచించడంతో ఇప్పుడు ఆన్‌లైన్‌ ఆర్డర్స్‌లో కూడా సద్దన్నం చేరిపోయింది. ఒకప్పుడు సద్ది అన్నాన్ని లైట్‌గా తీసుకున్నారు. రాత్రి మిగిలినదానిని పొద్దున తినడం నామోషీగా ఫీలయ్యారు. కానీ ఇప్పుడు చద్దన్నంలో గొప్ప పోషకాలు ఉన్నాయని తెలుసుకున్న ప్రజలు ఉదయం లేవగానే దాన్నే తింటున్నారు. రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో దీనికి మించిన ఫుడ్‌ లేదంటే అతిశయోక్తి కాదు. అందుకే ఇప్పుడు ఈ చద్దన్నానికి గిరాకీ పెరిగింది. మనదేశంలోనే కాదు విదేశాల్లోనూ పల్లెటూరి బ్రేక్‌ఫాస్ట్‌కు యమా క్రేజ్‌ వచ్చింది. అమెరికాలో అయితే ఈ చద్దన్నాన్ని రూ.వేలు పెట్టి కొనుగోలు చేసి మరీ తింటున్నారు. అమెరికాలోని ఓ స్టోర్‌లో చద్దన్నం దాదాపు వెయ్యి రూపాయలకి అమ్ముతున్నారు. చద్దన్నానికి ఉన్న క్రేజ్‌ చూసిన నెటిజన్లు షాక్‌ అవుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.