Female police: అధికారం ఉందని ఇంతకు తెగిస్తారా..! మహిళా పోలీసుల ఓవర్ యాక్షన్.. పాపం వృద్ధుడిపై ఇలా.. వీడియో.

| Edited By: Ravi Kiran

Jan 30, 2023 | 5:25 AM

రోజు రోజుకీ మనిషిల్లో మానవత్వం మంటగలుస్తోంది. తాజాగా నడిరోడ్డుపై ఓ వృద్ధుడిని కొడుతున్న ఇద్దరు మహిళా పోలీసుల వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో వృద్ధుని తనని కొట్టవద్దంటూ


రోజు రోజుకీ మనిషిల్లో మానవత్వం మంటగలుస్తోంది. తాజాగా నడిరోడ్డుపై ఓ వృద్ధుడిని కొడుతున్న ఇద్దరు మహిళా పోలీసుల వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోలో వృద్ధుని తనని కొట్టవద్దంటూ అడ్డు చెబుతున్నది చూసిన వారి హృదయాన్ని కదిలిస్తుంది. ఆ వృద్ధుడు చేసిన తప్పు ఏమిటో తెలుసా.. సైకిల్‌పై వెళుతుండగా కిందపడిపోవడమే.. లేవడానికి కొంత సమయం పట్టింది. దీంతో అక్కడ ఉన్న పోలీసులకు కోపం వచ్చింది. తమ లాఠీలకు పని చెప్పారు. ఈ దారుణ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. కైమూర్‌ జిల్లా భబువాలో నవాల్‌ కిశోర్‌ పాండే అనే 60 ఏండ్ల వృద్ధుడు పర్మల్‌పూర్‌లోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఇంగ్లిష్‌ టీచర్‌గా పనిచేస్తున్నారు. తన విధులు ముగించుకుని సైకిల్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో భబువాలోని జైప్రకాశ్‌ చౌక్‌లో రోడ్డు దాటుతున్నారు. అయితే అక్కడ విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్‌ పాండేను ఆగాలని సిగ్నల్‌ చూపించింది. అది చూడకుండా అతడు రోడ్డు క్రాస్‌ చేస్తున్న క్రమంలో పడిపోయాడు. దీంతో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. దీంతో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లు రోడ్డు మధ్య నుంచి త్వరగా వెళ్లిపోవాలని చితకబాదారు. కొట్టొద్దని వేడుకున్నప్పటికీ వారు వినకుండా కాళ్లు, చేతులపై లాఠీలు ఝులిపించారు. చివరికి ఓ వ్యక్తి అడ్డుపడటంతో వారు కొట్టడం ఆపారు. వారి దెబ్బలకు తన కాళ్లు, చేతులు వాపులు వచ్చాయని ఆ పెద్దాయన బాధపడ్డారు. కాగా, ఈ వీడియో వైరల్‌గా మారడంతో విషయం పోలీసు పెద్దలకు చేరింది. ఘటనపై స్పందించిన జిల్లా ఎస్పీ లలిత్‌ మోహన్‌ శర్మ.. బాధ్యులపై వీలైనంత త్వరగా చర్యలు తీసుకుంటామన్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.