పోలీసుల ముందే పెళ్లి కూతురుపై కన్న తండ్రి కాల్పులు.. ఎందుకంటే?
ప్రేమ వివాహం చేసుకుంటుందని కూతురిని చంపేశాడో తండ్రి. ఈ అమానుష ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో చోటు చేసుకుంది. మహేశ్ గుర్జార్ అనే వ్యక్తి తన కుమార్తె తనూ గుర్జార్‌ను పోలీసుల ఎదుటే తుపాకీతో కాల్చి హత్య చేయడం సంచలనంగా మారింది. తనకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారంటూ ఆ యువతి సోషల్ మీడియాలో పోస్టు పెట్టడమే పాపమైపోయింది. ఇష్టపడిన వ్యక్తితో పెళ్లి చేయమని అడగడం ఆమె చేసిన నేరమైంది. పోలీసులు చర్చలు జరుపుతుండగానే కన్న తండ్రే ఆమెను కాల్చి చంపడం పెను దుమారాన్ని రేపుతోంది.ఆగ్రాకు చెందిన విక్కీ, తనూ ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇరువురి పెళ్లికి యువతి తల్లిదండ్రులు ససేమిరా అన్నారు. మరో యువకుడికి ఇచ్చి వారం రోజుల్లో పెళ్లి చేసేందుకు ముహూర్తం పెట్టేశారు.
అయితే ఇష్టం లేని పెళ్లి చేస్తుండడంతో యువతి తీవ్ర ఆవేదనకు గురైంది. దీంతో నాకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారని..తనకు ఏమైనా అయితే నా కుటుంబం, బంధువులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అది కాస్త వైరల్‌గా మారింది.
వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. పోలీసులు ఇంటికి వచ్చి విచారణ జరిపారు. కులపెద్దలూ సమస్య పరిష్కరించేందుకు ముందుకు వచ్చారు. పోలీసులు, కులపెద్దలు అంతా కలిసి పంచాయితీ పెట్టి ఇద్దరికీ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో అందరి ముందు తాను చెప్పిన వ్యక్తిని కాకుండా ప్రియుడినే చేసుకుంటానని యువతి పదేపదే చెప్పడంతో గుర్జార్ ఆగ్రహానికి గురయ్యాడు. చర్చలు జరుగుతుండగానే తన వెంట తెచ్చుకున్న దేశీయ తుపాకీతో కుమార్తెపౌ బుల్లెట్ల వర్షం కురిపించాడు. దీంతో యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో పోలీసులు, కుల పెద్దలు నిర్ఘాంతపోయారు. వెంటనే మహేశ్‌ను అరెస్టు చేశారు. ఈ ఘటన సంచలనం సృష్టిస్తోంది.
సంక్రాంతి రైళ్లు హౌస్ఫుల్.. పండక్కి ఊరెళ్లేదెలా ??
ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారులు.. అంతలోనే..
స్కూల్ పిల్లలే టార్గెట్.. నెల్లూరు ‘నేర’ జాన కామాక్షి అరాచకాలు..!
వీడిని తమ్ముడు అంటామా ?? ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అన్ననే..
సర్పంచ్ గా గెలిపిస్తే వైఫై, టీవీ ఛానల్స్ ఫ్రీ
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
