Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుండెల్ని పిండేసే ఘటన..మూడేళ్లుగా అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా వీడియో

గుండెల్ని పిండేసే ఘటన..మూడేళ్లుగా అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా వీడియో

Samatha J
|

Updated on: Jul 05, 2025 | 3:05 PM

Share

కొన్ని ఘటనలు చూస్తే మానవత్వం ఇంకా మిగిలే ఉందని తెలిసి ఆశ్చర్యం వేస్తుంది. అలాంటి ఓ హృదయవిదారక ఘటనే నవీ ముంబైలో జరిగింది. 55 ఏళ్ల టెకీ అనూప్ కుమార్ నాయర్‌ జీవితం గత మూడేళ్లుగా ఓ ఫ్లాట్ గదిలో ఒంటరిగా సాగింది. 20 ఏళ్ల క్రితం సోదరుడి ఆత్మహత్య, కొన్ని సంవత్సరాల క్రితం తల్లితండ్రులు చనిపోవడంతో తీవ్ర మానసిక వేదనకు గురైన అతను బయటి ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెంచుకుని తన అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా నివసించడం ప్రారంభించాడు.

అంతే కాదు తన రోజువారీ అవసరాల కోసం పూర్తిగా ఆన్‌లైన్ డెలివరీ యాప్స్‌పై ఆధారపడ్డాడు. ఆహారం, ఇతర వస్తువులను ఆర్డర్ చేసుకుంటూ కాలం వెళ్లబుచ్చాడు. ఇంట్లో చెత్త బయట పారయేకపోవడం, పరిశుభ్రత లేకపోవడం వంటి వాటి వల్ల కాలికి తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకింది. అంతటి పరిస్థితి ఎదురైనా అనూప్ దాన్ని పట్టించుకోకుండా అదే దుర్భరమైన పరిస్థితుల్లో గడిపాడు. అంటే ఆయన మానసిక ఆరోగ్యం ఎంత దారుణంగా క్షీణించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనూప్‌ విషాదకర పరిస్థితిపై అపార్ట్‌మెంట్ వాసులు స్పందించారు. మానవతా దృక్పథంతో ఆలోచించి, ముంబైలో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ కు సమాచారం అందించారు. వారి చొరవతో అనూప్‌ను అపార్ట్‌మెంట్ నుంచి సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ప్రస్తుతం అనూప్‌కు మానసిక, శారీరక చికిత్స అందిస్తున్నారు. SEAL సంస్థ ఆధ్వర్యంలోని ఆశ్రమంలో ఆయనకు పునరావాసం కల్పించి, తిరిగి సాధారణ జీవితాన్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు

మరిన్నివీడియోల కోసం :

సీసీటీవీలో భార్యాభర్తల అరుపులు..ఆ మరునాడే .. ఏం జరిగిందంటే వీడియో

ఐదేళ్లుగా సినిమాల్లేవ్…ఇప్పుడు ఒక్కో మూవీకి రూ. 40 కోట్లు వీడియో

ప్రతి రోజూ పాలకూర తింటున్నారా? వీడియో