చాక్లెట్ కొనేందుకు డబ్బులు అడిగిన..కూతురి గొంతు నొక్కి వీడియో
ఓ తండ్రి తన కూతురిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. ఆమె అడిగింది కాదనక అన్నీ కొనిచ్చేవాడు. ఇప్పుడా చిన్నారికి నాలుగేళ్లు. అయితే ఇటీవల మద్యానికి బానిసైన తండ్రి దారుణానికి పాల్పడ్డాడు. తాజాగా చాక్లెట్ కొనేందుకు డబ్బులు అడిగిన నాలుగేళ్ల కూతురిపై ఆగ్రహంతో గొంతునొక్కి ఆ చిన్నారిని చంపాడు. భార్య ఫిర్యాదుపై పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఉద్గిర్ తాలూకా భీమా తండాలో నివసించే బాలాజీ రాథోడ్ మద్యానికి బానిస అయ్యాడు.
నిత్యం మద్యం సేవించి ఇంటికి వచ్చి గొడవపడేవాడు. దాంతో భార్య అతడ్ని వదిలి పుట్టింటికి వెళ్లింది. అయితే నాలుగేళ్ల కుమార్తె ఆరుషి అతని వద్దే ఉంది.ఆదివారం ఆ బాలిక చాక్లెట్ కొనేందుకు తండ్రి బాలాజీ రాథోడ్‌ను డబ్బులు అడిగింది. మద్యం మత్తులో ఉన్న అతడు కుమార్తెపై ఆగ్రహించాడు. చీరతో ఆరుషి గొంతునొక్కి హత్య చేశాడు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న భార్య వర్ష తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మద్యం మత్తులో కుమార్తెను చంపిన అతనికి ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేసింది. నిందితుడైన బాలాజీ రాథోడ్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
మరిన్నివీడియోల కోసం :
సీసీటీవీలో భార్యాభర్తల అరుపులు..ఆ మరునాడే .. ఏం జరిగిందంటే వీడియో
ఐదేళ్లుగా సినిమాల్లేవ్…ఇప్పుడు ఒక్కో మూవీకి రూ. 40 కోట్లు వీడియో
ప్రతి రోజూ పాలకూర తింటున్నారా? వీడియో
వైరల్ వీడియోలు

వర్క్ ఫ్రం హోమ్ అంటే ఆశపడ్డ మహిళ.. కట్ చేస్తే..

‘దగ్గరికొస్తే దూకి చస్తా’.. పోలీసులకు నేరస్తుడి వార్నింగ్

సెకండ్ హ్యాండ్ సైకిల్ పైన వీధి కుక్క తో 15 రాష్ట్రాల యాత్ర

మనవళ్లే.. ఆ రైతన్నకు కాడెద్దులు వైరల్ వీడియో

ఫోన్ చూసీ.. చూసీ.. చివరికి ఒక వ్యక్తికి ఏమైందో తెలుసా?వీడియో

ఇదేంటి భయ్యా.. తాగకుండానే పాజిటివ్ వీడియో

తన భర్త మరో మహిళను చూడగానే ఆడ గొరిల్లా ఏం చేసిందంటే?వీడియో
