Fake SI: నకిలీఎస్సై గుట్టు రట్టు చేసిన పెళ్లి చూపులు.! అక్కడకి కూడా యూనిఫామ్ లోనే..

|

Mar 20, 2024 | 8:17 PM

డిగ్రీ వరకూ చదువుకున్న ఓ యువతి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆర్పీఎఫ్‌ ఎస్సై పరీక్ష రాసింది. నేను త్వరలోనే ఎస్సై అయిపోతున్నానని ఊరూ వాడా ప్రచారం చేసుకుంది. తీరా ఉద్యోగం రాకపోవడంతో పరువుపోతుందని నకిలీ ఎస్సై అవతారం ఎత్తింది. ఇంట్లో అమ్మాయి పెళ్లి చేద్దామని పెళ్లి చూపులు ఎరేంజ్‌ చేశారు. ఎస్సై అవతారంలోనే పెళ్లి చూపులకు వెళ్లి అడ్డంగా దొరికిపోయింది.

డిగ్రీ వరకూ చదువుకున్న ఓ యువతి ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆర్పీఎఫ్‌ ఎస్సై పరీక్ష రాసింది. నేను త్వరలోనే ఎస్సై అయిపోతున్నానని ఊరూ వాడా ప్రచారం చేసుకుంది. తీరా ఉద్యోగం రాకపోవడంతో పరువుపోతుందని నకిలీ ఎస్సై అవతారం ఎత్తింది. ఇంట్లో అమ్మాయి పెళ్లి చేద్దామని పెళ్లి చూపులు ఎరేంజ్‌ చేశారు. ఎస్సై అవతారంలోనే పెళ్లి చూపులకు వెళ్లి అడ్డంగా దొరికిపోయింది. ఈ ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని నార్కట్ పల్లికి చెందిన మాళవిక నిజాం కాలేజీ లో డిగ్రీ పూర్తి చేసింది. 2018 లో ఆర్పీఎఫ్ ఎస్ఐ పరీక్ష రాసి, దాదాపు అన్ని అర్హతలు సాధించించిన మాళవిక.. మెడికల్ చెకప్ లో దృష్టి లోపం కారణంగా క్వాలిఫై కాలేకపోయింది. అయితే అప్పటికే తల్లిదండ్రులతో పాటు బంధువులకు తాను ఎస్‌ఐ అవుతున్నట్లు చెప్పుకుంది. ఇంట్లో తల్లిదండ్రులు మాళవికకు పెళ్లి చేద్దామని సంబంధం చూశారు. పెళ్లి చూపులకు కూడా యూనిఫాంలోనే వెళ్లింది మాళవిక. అక్కడ తాను శంకర్ పల్లి ఆర్పీఎఫ్ లో విధులు నిర్వహిస్తున్నట్లు నమ్మించింది. అందుకు సంబంధించిన నకిలీ ఐడీకార్డులు సైతం రెడీ చేసుకుంది. యూనిఫాం కుట్టించుకుంది. యూనిఫాంతో రీల్స్‌ చేసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పోస్ట్‌ చేసింది. ఇక పెళ్లి చూపుల్లో అబ్బాయి తరపువారు మాళవికగురించి పై అధికారులను సంప్రదించారు. దాంతో మాళవిక గుట్టు రట్టయింది. నల్గొండలో మాళవికను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు రైల్వే పోలీసులు. అయితే తనకు దృష్టి లోపం కారణంగా ఉద్యోగం రాకపోవడంతో పరువు పోతుందని, తల్లిదండ్రులు బాధపడతారని అలా చేసినట్టు పోలీసుల విచారణలో తెలిపింది. ఏడాది నుంచి ఆమె ఆర్పీఎఫ్ ఎస్ఐగా చెలామణి అవుతున్నట్టు తెలిపింది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..