నకిలీ డాక్టర్ మాజీ స్పీకర్‌ని చంపేసాడా?వీడియో

Updated on: Apr 12, 2025 | 8:55 PM

ఓ నకిలీ డాక్టర్‌ పలువురు రోగుల జీవితాలతో ఆటలాడాడు. ఏకంగా వరుస గుండె ఆపరేషన్లు చేసి వారిని పొట్టనపెట్టుకున్నాడు. కేవలం నెల రోజుల్లోనే ఏడుగురికి ఆపరేషన్లు చేసి హతమార్చాడు. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని దామో నగరంలోని ఒక ప్రైవేట్ మిషనరీ ఆసుపత్రిలో చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్‌లోని దామోహ్‌ జిల్లాలో ఎన్ జాన్ కెమ్ అనే వ్యక్తి క్రైస్తవ మిషనరీ ఆసుపత్రిలో యూకే రిటర్డ్న్‌ కార్డియాలజిస్ట్‌గా చెలామణి అయ్యాడు. అదే పేరున్న ప్రసిద్ధ బ్రిటిష్ వైద్యుడిగా నటించి నకిలీ సర్టిఫికెట్లు సృష్టించాడు. క్రిస్టియన్ మిషనరీ ఆసుపత్రిలో డాక్టర్‌గా పలువురు రోగులకు హార్ట్‌ సర్జరీలు కూడా చేశాడు. అయితే అతడు ఆపరేషన్‌ చేసిన రోగులంతా పిట్టల్లా చనిపోవడం ప్రారంభించారు. అతడి వద్ద గుండె ఆపరేషన్లు చేయించుకున్న రోగుల్లో ఒకే నెలలో ఏడుగురు మరణించారు. దీంతో ఆ డాక్టర్‌పై అనుమానాలు వ్యక్తమయ్యాయి.

నకిలీ డాక్టర్‌ బండారం బయటపడంతో ఆపరేషన్‌కు సిద్ధం ఉన్న పలువురు రోగులు భయంతో వేరే ఆస్పత్రికి వెళ్లిపోయారు. నిందితుడు నరేంద్ర యాదవ్‌పై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్ర అసెంబ్లీ మొదటి స్పీకర్‌గా పనిచేసిన రాజేంద్ర ప్రసాద్‌ శుక్లా మృతికి ఈ డాక్టర్ వైద్యమే కారణమని తాజాగా వార్తలు వస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్‌ లో బిలాస్‌పుర్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో శుక్లా గుండె సంబంధిత శస్త్రచికిత్స చేయించుకున్నారు. చికిత్స జరుగుతోన్న సమయంలోనే ఆయన మరణించారు. అప్పుడు డాక్టర్ నరేంద్ర జాన్‌ కెమ్‌ అనే యూకే వైద్యుడు వైద్యం చేశారు. ఈ ఘటనపై తాజాగా శుక్లా కుమారుడు మాట్లాడారు. నాన్నకు చికిత్స జరుగుతున్నప్పుడు తను అక్కడే ఉన్నట్లు చెప్పారు. ఆ వైద్యం జరుగుతున్న తీరుపై తనకు అప్పుడే అనుమానం వచ్చిందనీ అతడు నకిలీ వైద్యుడని తర్వాత తెలిసింది కానీ ప్రైవేటు ఆసుపత్రి మాత్రం అతడు గొప్ప డాక్టరని చెప్పిందనీ ఈ ఘటనపై ప్రభుత్వం సుమోటోగా విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు. బిలాస్‌పుర్ సీఎంహెచ్‌ఓ డాక్టర్ ప్రమోద్ తివారీ మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయంపై దర్యాప్తు బృందాన్ని పంపినట్లు చెప్పారు. అతడు సరైన రిజిస్ట్రేషన్ లేకుండా ప్రాక్టీస్ చేసుంటే.. అది చాలా తీవ్రమైన విషయమని తెలిపారు.

మరిన్ని వీడియోల కోసం

సూర్యుడికి సోదరుడు ఉన్నాడా..?వీడియో

 

ప్లేటు నిండా రొయ్యల కర్రీ..తినాలంటే వర్రీ వీడియో

 

క్రమం తప్పకుండా స్కూలుకి వస్తూ.. కొండముచ్చు ఏం చేస్తుందో చూడండి