Facebook: యువకుడి ప్రాణం కాపాడిన ఫేస్‌బుక్‌.. నీట్‌ ఎగ్జామ్‌లో క్వాలిఫై కాలేదని ఆత్మహత్యయత్నం..

|

Sep 15, 2022 | 9:53 AM

ఇంటర్నెట్‌ విస్తృతి పెరిగిన తర్వాత ప్రజలు సామాజికమాధ్యమాలకు బాగా అలవాటు పడ్డారు. కొందరు దీనిద్వారా అభివృద్ధి పధంలో నడుస్తుంటే కొందరు మిస్‌ యూజ్‌ చేస్తున్నారు. కానీ అదే


ఇంటర్నెట్‌ విస్తృతి పెరిగిన తర్వాత ప్రజలు సామాజికమాధ్యమాలకు బాగా అలవాటు పడ్డారు. కొందరు దీనిద్వారా అభివృద్ధి పధంలో నడుస్తుంటే కొందరు మిస్‌ యూజ్‌ చేస్తున్నారు. కానీ అదే సామాజిమాధ్యమం ఓ యువకుడి ప్రాణాలను కాపాడింది. నీట్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయానని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టాడు. ఫేస్‌బుక్ రియల్‌టైం సాంకేతికత ఆ సందేశాన్ని గుర్తించడంతో ఆ కుర్రాడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. పోలీసులు తెలిపి వివరాలు ప్రకారం.. లక్నోకు చెందిన 29 ఏళ్ల విద్యార్థి నీట్ పరీక్షల్లో ఫెయిలయ్యాడు. దీంతో మనస్తాపం చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టాడు. అతడు పెట్టిన పోస్టును రియల్ టైం టెక్నాలజీ ద్వారా గుర్తించిన ఫేస్‌బుక్ వెంటనే యూపీ పోలీసులను అప్రమత్తం చేస్తూ మెసేజ్ చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే విద్యార్థి ఇంటికి చేరుకుని అతడిని రక్షించారు. కాగా, కుంగుబాటు, ప్రాణహాని పరిస్థితులకు సంబంధించిన పోస్టులు కనిపించినప్పుడు వెంటనే ఆ సమాచారం తమకు అందించాలంటూ ఫేస్‌బుక్, యూపీ పోలీసుల మధ్య ఓ ఒప్పందం కుదిరింది. అందులో భాగంగానే తాజాగా విద్యార్థిని రక్షించడం సాధ్యమైందని పోలీసులు తెలిపారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

MLA viral video: ప్రభుత్వ పాఠశాల టాయిటెట్స్ శుభ్రం చేసిన ఎమ్మెల్యే.. అశుభ్రంగా ఉండటంపై సీరియస్..(వీడియో)

Auntys dance video: అట్లుంటది మరి ఆంటీస్ రంగంలోకి దిగితే.. దుమ్ములేచిపోవాల్సిందే.. ఆంటీలు మీరు కేక..

Variety Thief video: వీడో వెరైటీ దొంగ.. ఏం దొంగతనం చేశాడో చూస్తే ఆశ్చర్యపోవడమే కాదు.. ఛీ.. అంటారు..

Published on: Sep 15, 2022 09:53 AM