మనుషులు తలుచుకంటే సాధించలేనిది ఏదిలేదు. ఇందుకు చాలా ఉదాహరణలే ఉన్నాయి. ఇప్పుడు ఈ మగువ చేసిన సాహసం మరో ఉందాహరణగా నిలించింది. బ్రెజిల్‌కు చెందిన సాహసి కరినా ఒలియాని ఎవ్వరూ ఊహించని సాహసం చేసింది ఔరా అనిపించింది. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచ ప్రఖాత వన్యప్రాణి సాహసి అయిన కరినా ఒలియాని ఈ భూమి మీద అత్యంత ఉష్ణోగ్రతలు గల ప్రాంతాల్లో ఒకటైన వాల్కానిక్ లావా సరస్సుపై నుంచి ప్రయాణించి గిన్నిస్ ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది.
ఇథియోపియాలోని 1187 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత గల లావా సరస్సుపై నుంచి తాడు సహాయంతో (టైరోలిన్ ట్రావెర్స్) ప్రయాణించింది. అత్యంత ఉష్ణోగ్రత గల ఈ లావా సరస్సుపై 100.58 మీటర్లు ప్రయాణించి అత్యధిక దూరం ట్రావెల్ చేసిన వ్యక్తిగా రికార్డు సాధించింది. ఈ వీడియోను గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ సంస్థ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిందామె.ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ప్రాణాలకు తెగించిన ఆ యువతి చేసిన సాహసంకు ఫిదా అవుతున్నారు నెటిజన్స్.
మరిన్ని ఇక్కడ చదవండి :
Monkey Stunts : అందుకేనేమో కోతిచేష్టలు అంటుంటారు.. ఈ కోతులు చేస్తున్న పని చూస్తే నవ్వాపుకోలేరు..