ఇతని ఆయుష్షు చాలా గట్టిది.. రెప్పపాటులో తప్పించుకున్నాడు
ఇటీవల సెల్ ఫోన్లే కాదు.. ఫ్రిజ్‌లు కూడా పేలుతున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి వాషింగ్ మెషిన్లు వచ్చి చేరాయి. అవును ఓ వ్యక్తి లాండ్రీ షాపునుంచి తన బట్టలు తీసుకెళ్తున్న సమయంలో ఒక్కసారిగా వాషింగ్ మెషిన్ పేలిపోయింది.
ఇటీవల సెల్ ఫోన్లే కాదు.. ఫ్రిజ్‌లు కూడా పేలుతున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి వాషింగ్ మెషిన్లు వచ్చి చేరాయి. అవును ఓ వ్యక్తి లాండ్రీ షాపునుంచి తన బట్టలు తీసుకెళ్తున్న సమయంలో ఒక్కసారిగా వాషింగ్ మెషిన్ పేలిపోయింది. అతను తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. లేదంటే అక్కడే సజీవ దహనం అయ్యేవాడు. అందుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి లాండ్రీలో తన బట్టలు ఉతుక్కుని డ్రై చేసిన తర్వాత వాటిని బ్యాగులో వేసుకొని బయటకు వెళ్లాడు. అతను షాపులోనుంచి అలా అడుగు బయటపెట్టాడో లేదో అక్కడే ఉన్న ఓ వాషింగ్ మెషీన్ పేలిపోయింది. ఆ గదిమొత్తం మంటలు చెలరేగాయి. ఆ వ్యక్తి ఒక్క సెకండులో ప్రాణాపాయం నుంచి తప్పిచుకున్నాడు. లేదంటే నిర్దాక్షిణ్యంగా అతని ప్రాణాలు పోయేవి. అంతేకాదు ఆ సమయంలో షాపులో ఇంకెవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. ఈ వీడియో ఓ ట్విట్టర్ యూజర్ తన ఖాతాలో పోస్ట్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పిట్ట చిన్నదే కానీ.. మహా ముదురు.. వీడియో చూస్తే మీరు అదే అంటారు
అడవిదున్నపై పులి ఎటాక్.. చివరిలో సూపర్ ట్విస్ట్
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

