పిట్ట చిన్నదే కానీ.. మహా ముదురు.. వీడియో చూస్తే మీరు అదే అంటారు

పిట్ట చిన్నదే కానీ.. మహా ముదురు.. వీడియో చూస్తే మీరు అదే అంటారు

Phani CH

|

Updated on: Apr 15, 2023 | 9:39 AM

ఈ భూమిపై జీవించే ప్రతి జీవి పరాన్న జీవే. ఆహారం కోసం ఇతర జీవులపై ఆధార పడాల్సిందే. తాజాగా ఓ పక్షికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఈ భూమిపై జీవించే ప్రతి జీవి పరాన్న జీవే. ఆహారం కోసం ఇతర జీవులపై ఆధార పడాల్సిందే. తాజాగా ఓ పక్షికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. పాపం ఓ చిన్న పక్షి ఆహారం కోసం వెతుకుతోంది. ఇంతలో ఓ అరటిచెట్టుమీద ఓ కీటకం కనిపించింది. దాన్ని తిందామని ప్రయత్నించింది. పక్షి ముక్కు మొనతేలి పదునుగా ఉంది. పురుగును పట్టుకునే ప్రయత్నంలో పిట్ట ముక్కు కాస్తా అరటిచెట్టులో ఇరుక్కుపోయింది. కీటకం తప్పించుకుంది. దాని ముక్కు షార్ప్‌గా ఉండటంతో.. అది మొక్కలోకి కూరుకుపోయింది. ఎంత ప్రయత్నించినా ఆ ముక్కు బయటకు రాకపోవడంతో నిస్సహాయంగా అలా వేలాడుతూ ఉండిపోయింది. ఇంతలో ఓ వ్యక్తి దాని అవస్థను గమనించాడు. తన ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని భావించిన పిట్ట.. జీవం లేనట్లుగా నటించింది. అతను పట్టుకుని అటూ ఇటూ తిప్పినా.. ప్రాణం పోయినట్లుగా నటించింది. కాసేపటికి ఆ వ్యక్తి చెట్టులో ఇరుక్కుపోయిన ముక్కును బయటకు తీసి పిట్టను తన చేతిలో పెట్టుకోగా.. అలర్ట్ అయిన ఆ పక్షి తుర్రున ఎగిరిపోయింది. ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. పిట్ట చిన్నదే.. కానీ మహా ముదురు అంటున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అడవిదున్నపై పులి ఎటాక్‌.. చివరిలో సూపర్‌ ట్విస్ట్‌

ఏం ఐడియా బాస్‌.. ఇది ఇండియా దాటకూడదంతే..

టీ-ష‌ర్ట్‌ను ఎలా మ‌డ‌త పెట్టిందో చూస్తే.. వావ్ అనాల్సిందే

Published on: Apr 15, 2023 09:25 AM