అడవిదున్నపై పులి ఎటాక్.. చివరిలో సూపర్ ట్విస్ట్
అడవిలో ఆహారం కోసం వెతుకుతూ ఉంది ఓ పెద్దపులి. ఇంతలో దానికి ఓ అడవి దున్న కనిపించింది. హమ్మయ్య నా పంట పండింది అనుకుంది. వెంటనే దాన్ని వేటాడేందుకు ప్రయత్నించింది.
అడవిలో ఆహారం కోసం వెతుకుతూ ఉంది ఓ పెద్దపులి. ఇంతలో దానికి ఓ అడవి దున్న కనిపించింది. హమ్మయ్య నా పంట పండింది అనుకుంది. వెంటనే దాన్ని వేటాడేందుకు ప్రయత్నించింది. పులిని గమనించిన దున్న వెంటనే పరుగందుకుంది. పెద్దపులి దున్నను ఛేజ్ చేసి..చేసి.. అలసిపోయింది. ఇక లాభం లేదనుకుని ఆగిపోయింది. అడవి దున్న పారిపోయింది. నిరాశతో పులి వెనుదిరిగింది. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సురేందర్ మెహ్రా తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. అడవి దున్నను ఛేజ్ చేసేందుకు ప్రయత్నించిన టైగర్ అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఇదే వీడియోను ఐఏఎస్ అధికారి సుప్రియ సాహు కూడా షేర్ చేశారు. ఒక జంతువు జోన్‌లోకి మరొకటి వెళ్లినందుకే ఈ రగడని ఓ యూజర్ కామెంట్ చేయగా, ఉనికి కోసం పోరాటం తప్పదని మరికొందరు కామెంట్స్ చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Published on: Apr 15, 2023 09:28 AM
వైరల్ వీడియోలు
Latest Videos