తను చనిపోతూ 48 మంది ప్రాణాలను కాపాడిన బస్సు డ్రైవర్

|

Oct 30, 2023 | 9:39 PM

బస్సు డ్రైవింగ్​ సీట్​లో కూర్చోవడం అంటే వాహనం నడపడమే కాదు... ఆ బస్సులో ప్రయాణిస్తున్న ఎవ్వరికీ ఏమీ కాకుండా తన ప్రాణాలు పణంగా పెట్టడం అంటారు. ఈ సిద్దాంతాన్ని నమ్మిన ఆ డ్రైవర్‌ తన ప్రాణం అడ్డుపెట్టి 48 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడాడు. ఊహించని ప్రమాదంలో అందిరి ఆయువును కాపాడి.. తుదిశ్వాస విడిచాడు. ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సు ఒడిశాలోని కంధమాల్‌ జిల్లా శరణ్‌ఘర్‌ నుంచి 48 మంది ప్రయాణికులతో భువనేశ్వర్‌కు బయల్దేరింది.

బస్సు డ్రైవింగ్​ సీట్​లో కూర్చోవడం అంటే వాహనం నడపడమే కాదు… ఆ బస్సులో ప్రయాణిస్తున్న ఎవ్వరికీ ఏమీ కాకుండా తన ప్రాణాలు పణంగా పెట్టడం అంటారు. ఈ సిద్దాంతాన్ని నమ్మిన ఆ డ్రైవర్‌ తన ప్రాణం అడ్డుపెట్టి 48 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడాడు. ఊహించని ప్రమాదంలో అందిరి ఆయువును కాపాడి.. తుదిశ్వాస విడిచాడు. ప్రైవేటు ట్రావెల్స్‌కు చెందిన ఓ బస్సు ఒడిశాలోని కంధమాల్‌ జిల్లా శరణ్‌ఘర్‌ నుంచి 48 మంది ప్రయాణికులతో భువనేశ్వర్‌కు బయల్దేరింది. బస్సు కంధమాల్‌ జిల్లా పబురియా గ్రామానికి చేరుకునే సరికి డ్రైవర్‌ సనా ప్రధాన్‌కు ఛాతీలో తీవ్రమైన నొప్పి మొదలైంది. క్రమంగా నొప్పి ఎక్కువ అయ్యింది. అయితే.. బస్సుపై నియంత్రణ కోల్పోకుండా.. కొద్ది దూరం వెళ్లాక బస్సును ఆపేందుకు రోడ్డు పక్కనే ఉన్న గోడకు ఢీకొట్టాడు. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

పాక్‌ నుంచి భారత్‌కు రానున్న అంజు.. మీడియాకు తెలిపిన ఆమె భర్త నస్రుల్లా

ఆరున్నర కోట్ల ఉద్యోగం వదిలేశాడు.. ఆ తర్వాత ??

ఆస్తి కోసం ఓ పోలీసు చేసిన నిర్వాకం.. భార్య చనిపోయిందంటూ దొంగ డెత్‌ సర్టిఫికెట్‌..

సత్తాచాటిన ప్యాపిలి కుర్రాడు.. నరేంద్రమోదీ ప్రశంసలు..

స్కేటింగ్‌ పై సోలో డ్యాన్స్‌.. అదరగొట్టిన హైదరాబాద్‌ కుర్రోడు..