Srivalli Tune: రాజకీయాలకు పాకిన పుష్ప ఫీవర్.. శ్రీవల్లి పాట ట్యూన్తో యూపీలో ఎన్నికల ప్రచారం.. వైరల్ అవుతున్న వీడియో
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. ఈ సినిమాలోని పాటలు, డైలాగులకు అందరూ ముగ్ధులవుతున్నారు. విదేశాల్లోని సంగీత కళాకారులు, క్రికెటర్లు ఈ సినిమాల్లోని సాంగ్స్, డైలాగ్స్‌ను అనుకరిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు ‘పుష్ప’ ఫీవర్ రాజకీయాలకు కూడా పాకింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’క్రేజ్ అంతకంతకూ పెరుగుతోంది. ఈ సినిమాలోని పాటలు, డైలాగులకు అందరూ ముగ్ధులవుతున్నారు. విదేశాల్లోని సంగీత కళాకారులు, క్రికెటర్లు ఈ సినిమాల్లోని సాంగ్స్, డైలాగ్స్‌ను అనుకరిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు ‘పుష్ప’ ఫీవర్ రాజకీయాలకు కూడా పాకింది. దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తన ప్రచార గీతాన్ని విడుదల చేసింది. పుష్ప సినిమాలోని శ్రీవల్లి సాంగ్ ట్యూన్‌ను తీసుకుని యూపీ రాష్ట్రం గొప్పతనాన్ని చాటి చెబుతూ ఈ పాటను రూపొందించడం విశేషం.‘తూ హై గజాబ్ యూ, యూపీ; తేరీ కసమ్, యూపీ(చాలా అందంగా ఉంటావు, యూపీ..)’ అంటూ సాగే ఈ పాటలో రాణీ లక్ష్మీబాయి వంటి గొప్ప వ్యక్తులను మరోసారి గుర్తుచేశారు. కాగా ఈ వీడియో సాంగ్‌ను కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసింది. ‘ఉత్తరప్రదేశ్ వాసులం అయినందుకు గర్వంగా ఉంది..!’ అంటూ దీనికి క్యాప్షన్ జత చేసింది. కాగా ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయపార్టీలు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రచారం కోసం సరికొత్త పద్ధతులను అవలంభిస్తున్నాయి. కాగా ఇటీవల తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తూ ఆమ్ ఆద్మీ పార్టీ ఓ ప్రత్యేక వీడియోను రూపొందించింది. ఇందుకోసం 2007లో విడుదలైన అక్షయ కుమార్, ఫర్దీన్ ఖాన్, రితేశ్ దేశ్‌ముఖ్ మల్టీస్టారర్ సినిమా ‘హే బేబీ’ సినిమాను వాడుకుంది. ఇందులో బాగా పాపులరైన ‘మస్త్ కలందర్’ పాటను ఫొటో ఎడిట్ చేసి వీడియోగా రూపొందించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేసింది.
మరిన్ని చూడండి ఇక్కడ: