Bride funny video: పాపం పెళ్లి కూతురు..పానీపూరి తినాలనుకుంది.. కానీ సీన్ రివర్స్ అయింది.. నవ్వులు పూయిస్తున్న వీడియో
ఇటీవల సోషల్ మీడియాలో పెళ్లిళ్లలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, నెట్టింట్లో వైరల్ అవుతున్న ఓ వీడియో కూడా నెటిజన్లను తెగ నవ్విస్తోంది.
సాధారణంగా పెళ్లి వేడుకలలో వధువరులిద్దరూ ఎంతో సంతోషంగా కనిపిస్తుంటారు. ఆనందంగా కలిసి డ్యాన్స్ చేయడం.. ఒకరికోకరు సహాయం చేసుకుంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో వధువు ఎంతో ఆనందంగా పెళ్లిలో పానీపూరి తినాలకుంది. అయితే పానీపూరి తింటున్న సమయంలో ఆమెకు తన ముక్కుపుడక అడ్డు వచ్చింది. దీంతో చేసేదేమి లేక తన పక్కనే ఉన్న పెళ్లి కొడుకు సాయం తీసుకుని పానీపూరిని తినేసింది. ఇక వీరిద్దరి అన్యోన్యతను చూసి నెటిజన్స్ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని చూడండి ఇక్కడ:
వైరల్ వీడియోలు
Latest Videos