వాట్సాప్‌లో హాయ్ అంటే.. FIR కాపీ ఓయ్ అంటుంది
మీరు పోలీసు స్టేషన్‌కు వెళ్లకుండానే మీ ఫిర్యాదు ఎఫ్‌ఐఆర్ కాపీని ఇప్పుడు వాట్సాప్ ద్వారా సులభంగా పొందవచ్చు. ఈ కొత్త విధానం పౌరులకు ఎఫ్‌ఐఆర్ వివరాలను తనిఖీ చేయడంలో సహాయపడుతుంది. ఫిర్యాదులో పేర్కొన్న సెక్షన్‌లు, నిందితులు, ఇతర ముఖ్యమైన సమాచారం అంతా మీ ఫోన్‌లోనే తెలుసుకోవచ్చు. ఎఫ్‌ఐఆర్ కాపీ కోసం పోలీసులను అభ్యర్థించాల్సిన అవసరం లేదు.
మీరు ఏదైనా సమస్యపై ఫిర్యాదు చేశారా..ఆ ఫిర్యాదుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్ కాపీ కోసం ఠాణా చుట్టూ తిరుగుతున్నారా..మీరు అలా పోలీసు స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ ఫిర్యాదుకి సంబంధించిన ఎఫ్‌ఐఆర్ కాపీ నేరుగా ఫిర్యాదుదారుల వాట్సాప్‌కే వచ్చే అవకాశం ఉంది. ఫిర్యాదు దారులు ఎఫ్‌ఆర్ కాపీ కోసం స్టేషన్ల చుట్టూ తిరగడం, సంబంధిత అధికారులను వేడుకోవాల్సిన అవసరం లేదు. వృద్ధులకు ఇంటివద్దకే వెళ్లి ఎఫ్‌ఐఆర్ కాపీని అందచేసే కార్యక్రమం సత్ఫలితాలివ్వడంతో సాధారణ ప్రజానీకానికి సైతం ఎఫ్‌ఐఆర్ కాపీని అందుకోవడం మరింత సరళతరం చేశారు. త్వరలోనే ఈ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఫిర్యాదు చేయడమే కానీ.. ఎఫ్‌ఐఆర్ కాపీలో ఏమేమి వివరాలున్నాయో తెలుసుకోవడం సామాన్యులకు చాలా కష్టం. ఎందుకంటే ఎఫ్‌ఐఆర్ కాపీని పోలీసులు బయటకు ఇవ్వరు. ఇప్పటి వరకు ఎఫ్‌ఐఆర్ కాపీ కేవలం పోలీసుల రికార్డుల్లోనే ఉండేది. ప్రస్తుతం వాట్సాప్‌లో ఎఫ్‌ఐఆర్ కాపీని సులభంగా పొందవచ్చు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాలన్నీ సరిగా నమోదు చేశారా? లేదా? ఏ సెక్షన్ పెట్టారు? నిందితుల్లో ఎవరిని ఏ1గా చేర్చారు? లాంటి ముఖ్యమైన వివరాలు తెలుసుకోవచ్చు. తాము చెప్పిన వ్యక్తులపై కేసులు పెట్టారా? లేక ఇతరుల్ని చేర్చారా? నేర తీవ్రత తగ్గించడానికి సెక్షల్ని తారుమారు చేశారా? అనేది విషయాలు తెలుసుకునే వీలుంటుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Weather Update : ఏపీకి తప్పిన తుఫాను ముప్పు.. కానీ..
Gold Price Today: భారీగా పెరిగిన బంగారం ధర.. ఇవాళ తులం ఎంతంటే
రూ.5 వేలు కాదు.. 20 వేలు కావాలి! సంక్రాంతి వేళ ఆర్టీసీలో సమ్మె సైరన్
