Ganga River: రూటు మార్చిన గంగా నది .. కారణమేంటంటే ??

|

Jun 20, 2024 | 5:54 PM

ప్రపంచంలోని పెద్ద నదులలో ఒకటైన గంగానది సుమారు 2,500 సంవత్సరాల క్రితం తన ప్రవాహ దిశను మార్చుకుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం గంగానది ప్రవహిస్తున్న ప్రాంతంలో ఈ మార్పు జరిగిందని అమెరికాలోని కొలంబియా క్లైమేట్‌ స్కూల్‌కు చెందిన భూభౌతిక శాస్త్రవేత్త, ఈ అధ్యయన నివేదిక సహ రచయిత మైఖేల్‌ స్టెక్లెర్‌ తెలిపారు. హిమాలయాల్లో ప్రారంభమైన గంగానది తన సుదీర్ఘ ప్రస్థానంలో మరెన్నో ఉపనదులను కలుపుకొని బంగాళా ఖాతంలో కలుస్తుంది.

ప్రపంచంలోని పెద్ద నదులలో ఒకటైన గంగానది సుమారు 2,500 సంవత్సరాల క్రితం తన ప్రవాహ దిశను మార్చుకుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం గంగానది ప్రవహిస్తున్న ప్రాంతంలో ఈ మార్పు జరిగిందని అమెరికాలోని కొలంబియా క్లైమేట్‌ స్కూల్‌కు చెందిన భూభౌతిక శాస్త్రవేత్త, ఈ అధ్యయన నివేదిక సహ రచయిత మైఖేల్‌ స్టెక్లెర్‌ తెలిపారు. హిమాలయాల్లో ప్రారంభమైన గంగానది తన సుదీర్ఘ ప్రస్థానంలో మరెన్నో ఉపనదులను కలుపుకొని బంగాళా ఖాతంలో కలుస్తుంది. 2,500 ఏళ్ల క్రితం గంగానది ప్రధాన ప్రవాహం ప్రస్తుత బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకా నగరానికి దక్షిణ దిశన సుమారు 100 కి.మీ. దూరంలో ఉండేదని, ఆ నాడు సంభవించిన భారీ భూకంపం తర్వాత నది ప్రస్తుత దిశకు మారిందనే అంచనాకు భూభౌతిక శాస్త్రవేత్తలు వచ్చారు. ఉపగ్రహ చిత్రాలు, శాస్త్రవేత్తల బృందం జరిపిన వివిధ పరిశోధనల ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చినట్లు అధ్యయన నివేదిక ప్రధాన రచయిత, నెదర్లాండ్స్‌కు చెందిన వాహ్‌నింగెన్‌ విశ్వవిద్యాలయ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఎలిజబెత్‌ ఎల్‌.చాంబర్లేన్‌ తెలిపారు. బంగ్లాదేశ్‌ ఇప్పటికీ భూకంప ప్రమాద జోన్‌ పరిధిలోనే ఉంది. ఈ అధ్యయనం వివరాలు ‘నేచర్‌ కమ్యూనికేషన్స్‌’ పత్రికలో ప్రచురితమయ్యాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సబ్బులు, హెయిర్‌ ఆయిల్స్‌ ధరలు పైపైకి

రాధిక మర్చంట్‌కు.. అనంత్‌ అంబానీ లవ్‌ లెటర్‌..

తన గొప్ప మనసుతో.. అభిమాని కుటుంబానికి దేవుడైన మహేష్

తన ఆరాధ్య దేవిని.. అరాచకంగా చూపించిన RGV

ఖుషీ సినిమాను గుర్తు చేసిన మెగా బాయ్ అఖీరా