డేగను విమానంలో తీసుకొస్తున్నారా అని అడగ్గా అవునని జవాబిచ్చిన సౌదీ వ్యక్తి డేగకు ప్రత్యేకంగా పాస్ పోర్టు కూడా తీశానని చెప్పాడు. పాస్ పోర్టులో ఆ డేగ లింగం, పుట్టిన దేశం, ఇంతకుముందు సందర్శించిన ప్రదేశాల వివరాలున్నాయి. ఇది మగపక్షి స్పెయిన్ కు చెందింది అని ఆ పాస్ పోర్టులోని వివరాలను యజమాని చదివి వినిపించాడు. ఇది విన్న ఆ ప్రయాణికుడు ఇది చాలా అసాధారణమని ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఈ సంభాషణకు సంబంధించిన వీడియో ప్రస్తుతం ఇన్ స్టాగ్రామ్ లో వైరల్ అవుతుంది. ఇప్పటి వరకు 1.6 మిలియన్లకు పైగా నెటిజన్లు ఈ వీడియోను చూసి లైకులు, కామెంట్లు పెడుతున్నారు. కొందరు నెటిజన్లు తమకంటే ఆ డేగ మెరుగైన జీవితాన్ని గడుపుతోందని సరదాగా వ్యాఖ్యానించారు. యూఏఈ సంపన్నుల విలాసవంతమైన జీవనానికి ఇది నిదర్శనమని మరికొందరు కామెంట్ చేశారు.